ఈ నెల 14 బీజేపీలోకి ఈటల.. రేపు రాజేందర్ ఇంటికి తరుణ్ చుగ్, భేటీకి ప్రాధాన్యం

By Siva KodatiFirst Published Jun 10, 2021, 8:17 PM IST
Highlights

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమలు కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారు. 

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమలు కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారు. అయితే బీజేపీలో చేరడానికి ముందే ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఈటల ఇంటికి తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ వెళ్లనున్నారు. 

కాగా, టీఆర్ఎస్‌తో 19 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటూ ఈటల రాజేందర్ ఈ నెల 4న గులాబీ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన .. తాను నీకు బానిసను కాదు.. ఉద్యమ సహచరుడినని చెప్పారు. ప్రజాస్వామ్యంలో నియంతకు చోటులేదన్నారు. తెలంగాణ ప్రజల కోసం పెట్టింది టీఆర్ఎస్ పార్టీ అని ఆయన గుర్తు చేశారు. లల్లూ ప్రసాద్ యాదవ్, మాయావతి మాదిరిగా ఏర్పాటు చేసిన పార్టీ ఇది కాదన్నారు. 

Also Read:ముఖ్యనేతలు సిద్దం... ఆ పార్టీల నుండి బిజెపిలోకి భారీ చేరికలు: బండి సంజయ్ సంచలనం

కేటీఆర్ కు సీఎం పదవి ఇచ్చుకో తమకు అభ్యంతరం లేదని తాము చెప్పామని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కానీ తన కొడుకును సీఎం చేసే పేరుతో తమపై బరద చల్లే ప్రయత్నాన్ని మానుకోవాలన్నారు.కేటీఆర్ కింద పని చేస్తానని హరీష్ రావు ప్రకటించారన్నారు. కేటీఆర్  సీఎం పదవికి అర్హుడని కూడ తాను ఆనాడు మద్దతు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో  నీ కోసం అండగా ఉన్నవాళ్లు పార్టీ నుండి బయటకు వెళ్తున్నారన్నారు.  ఉద్యమ సమయంలో  నిన్ను చంపినా కుక్కను చంపినా ఒక్కటే అని విమర్శించిన వారంతా నీ వెంటే  ఉన్నారన్నారు. 

click me!