పోస్టుమార్టం కోసం ఉమా మహేశ్వరి మృతదేహం: ఉస్మానియాకు బాలకృష్ణ, లోకేష్

By narsimha lode  |  First Published Aug 1, 2022, 5:52 PM IST

ఎన్టీఆర్ కూతరు ఉమా మహేశ్వరీ మృతదేహన్ని హైద్రాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రికి బాలకృష్ణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తదితరులు వచ్చారు.


హైదరాబాద్: NTR  కూతురు ఉమా మహేశ్వరి మృతదేహన్ని Hyderabad  లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన  Uma Maheshwari సోదరుడు Balakrishna, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి Nara Lokesh లు సోమవారం నాడు సాయంత్రం Osmania ఆసుపత్రికి చేరుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రి వద్ద Ambulance లోనే సోదరి పార్థీవదేహం వద్ద బాలకృష్ణ కొద్దిసేపు ఉన్నారు. పోస్టుమార్టం ప్రక్రియకు సంబంధించి పోలీసులు, వైద్యులతో చర్చించారు. ఈ విషయమై బాలకృష్ణ ఆయన సోదరుడు కూడా అక్కడే ఉన్నారు.

 అదే సమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్దకు చేరుకున్నారు. ఉమా మహేశ్వరి  పోస్టుమార్టానికి సంబంధించి కుటుంబ సభ్యుల నుండి అనుమతి రాగానే మార్చురీకి తరలించి పోస్టుమార్టం కోసం ఏర్పాట్లు చేశారు. పోస్టుమార్టం పూర్తైన తర్వాత మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. 

Latest Videos

undefined

also read:ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరిది ఆత్మహత్యగా తేల్చిన పోలీసులు

ఇవాళ మధ్యాహ్నం ఉమా మహేశ్వరి తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది.ఈ విషయమై కూతురు దీక్షిత ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం జరిగే సమయంలో బాలకృష్ణ సహా కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోనే ఉన్నారు. 
 

click me!