
ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. తొలుత అనారోగ్య కారణాలతో ఆమె మరణించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే పోలీసులు ఆత్మహత్యగా తేల్చడంతో ఇప్పుడు కొత్త అనుమానాలు మొదలయ్యాయి. అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి కారణంగానే ఉమామహేశ్వరి బలవన్మరణానికి పాల్పడ్డారని వార్తలు వస్తున్నాయి.
ALso Read:ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరిది ఆత్మహత్యగా తేల్చిన పోలీసులు
దీనిపై పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. మధ్యాహ్నం 2.30కి ఉమామహేశ్వరి కూతురు దీక్షిత కాల్ చేసిందన్నారు. తన తల్లి ఆత్మహత్య చేసుకుందని దీక్షిత సమాచారం ఇచ్చిందని పోలీసులు తెలిపారు. దీంతో మధ్యాహ్నం 2.45కి ఉమామహేశ్వరి నివాసానికి వెళ్లామని జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉమామహేశ్వరి గదిలోకి వెళ్లామని... దీక్షిత ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు.
ALso REad:లోపలికి వెళ్లి ఎంతకూ బయటకు రాలేదు, తలుపులు బద్దలుకొట్టి చూస్తే.. : కంఠమనేని ఉమామహేశ్వరి కుమార్తె
అంతకుముందు ఉమామహేశ్వరి కుమార్తె దీక్షిత మీడియాతో మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతోనే తన తల్లి ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. ఆత్మహత్య సమయంలో ఇంట్లో నలుగురమే వున్నామని.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అమ్మ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుందన్నారు. భోజనం సమయం వరకు బయటకు రాకపోవడంతో .. తలుపులు తెరిచే ప్రయత్నం చేశామని దీక్షిత చెప్పారు. లోపలి నుంచి గడియ పెట్టుకుని ఉందని.. ఆత్మహత్య సమయంలో తన భర్తతో పాటు నాన్న కూడా ఇంట్లోనే వున్నారని దీక్షిత తెలిపారు.
ఆమె భౌతికకాయాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురికీ తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం ఉమామహేశ్వరి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు పోలీసులు. ఇకపోతే.. ఉమామహేశ్వరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. వీరిలో ఇటీవలే చిన్న కుమార్తెకు వివాహం జరిగింది.