శ్రీశైలం పవర్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం: షార్ట్ సర్క్యూటే కారణం...!

By narsimha lodeFirst Published Aug 23, 2020, 11:49 AM IST
Highlights

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని సీఐడీ బృందం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ విషయమై సీఐడీ బృందం కర్నూల్ లోని జల విద్యుత్ కేంద్రంలో ఆదివారం నాడు విచారణ చేస్తోంది.


కర్నూల్: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని సీఐడీ బృందం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ విషయమై సీఐడీ బృందం కర్నూల్ లోని జల విద్యుత్ కేంద్రంలో ఆదివారం నాడు విచారణ చేస్తోంది.

అగ్ని ప్రమాదానికి గల కారణాలపై సీఐడీ బృందం  విశ్లేషిస్తోంది.  సంఘటన స్థలంలో కాలిపోయిన వైర్లు, పవర్ సప్లైకి ఉపయోగించిన వైర్లను సీజ్ చేశారు. పవర్ జనరేషన్, సప్లై ఎలా జరిగిందనే విషయాన్ని వీడియో తీసి టెక్నికల్ బృందం వివరించింది.  అధికారుల స్టేట్ మెంట్ ను సీఐడీ బృందం రికార్డు చేసింది. 

also read:ఫైర్ అక్సిడెంట్ జరిగింది, భయపడొద్దు: ఫ్యామిలీ మెంబర్స్ కు ఏఈ సుందర్ ఫోన్

కాలిపోయిన వైర్లలో నీటి ఆనవాళ్లు ఉన్నాయా అనే కోణంలో కూడ సీఐడీ బృందం ఆరా తీస్తోంది. గతంలో ఇక్కడ చోటు చేసుకొన్న ప్రమాదాలతో ఈ ప్రమాదాన్ని పోల్చలేమని సీఐడీ బృందం అభిప్రాయపడుతోంది.

ఈ నెల 20వ తేదీ రాత్రి శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో  9 మంది విద్యుత్ శాఖ ఉద్యోగులు మరణించారు. ఈ ప్రమాదం నుండి సుమారు 10 మంది ఉద్యోగులు సురక్షితంగా తప్పించుకొన్నారు.

ఇప్పటివరకు ఈ రకమైన ప్రమాదం జరగలేదని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు.

click me!