చిట్యాల సీఐ ఆత్మహత్యాయత్నం... కారణాలను వివరిస్తూ సూసైడ్ నోట్

Arun Kumar P   | Asianet News
Published : Feb 11, 2021, 10:30 AM ISTUpdated : Feb 11, 2021, 10:38 AM IST
చిట్యాల సీఐ ఆత్మహత్యాయత్నం... కారణాలను వివరిస్తూ సూసైడ్ నోట్

సారాంశం

కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతో సతయతమవుతూ ఇలా ప్రాణాలు తీసుకుంటున్నానంటూ సూసైడ్ లెటర్ రాసిన సదరు సీఐ కారులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. 

భూపాలపల్లి: వరంగల్ పట్టణంలో నివాసముండే ఓ పోలీస్ అధికారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతో సతయతమవుతూ ఇలా ప్రాణాలు తీసుకుంటున్నానంటూ సూసైడ్ లెటర్ రాసిన సదరు సీఐ కారులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల సీఐగా సాయిరమణ పనిచేస్తున్నాడు. అతడు కుటుంబంతో కలిసి వరంగల్ లో నివాసముంటున్నాడు. అయితే అతడు నిన్న(బుధవారం) తన కారులో ఒంటరిగా బయలుదేరి నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నాడు. కారులోనే కూర్చుని తనతోపాటు తెచ్చుకున్న పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

ఇలా పురుగులమందు ప్రభావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన అతన్ని అటువైపు పెట్రోలింగ్ కు వచ్చిన పోలీసులు గుర్తించారు. అతడి జేబులో లభించిన ఐడీ కార్డును బట్టి చిట్యాల సీఐగా గుర్తించారు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందేలా చూశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. 

కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలే కారణమని సూసైడ్‌ నోట్‌ రాసి ఉన్నట్లు కేయూసీ ఠాణా సీఐ జనార్దన్‌రెడ్డి తెలిపారు.సీఐ ఆత్మహత్యాయత్నంపై సమాచారం అందుకున్న జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఇంఛార్జి ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌ వెంటనే హన్మకొండలోని ఆస్పత్రికి చేరుకొని సాయిరమణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.  

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు