జీహెచ్ఎంసీ మేయర్ పదవికి బీజేపీ పోటీ: అభ్యర్ధి రాధా ధీరజ్ రెడ్డి

By narsimha lodeFirst Published Feb 11, 2021, 10:18 AM IST
Highlights

జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు  బీజేపీ పోటీ చేయనుంది.  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకి కూడ స్పష్టమైన మెజారిటీని ఇవ్వలేదు.

హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు  బీజేపీ పోటీ చేయనుంది.  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకి కూడ స్పష్టమైన మెజారిటీని ఇవ్వలేదు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యధిక సీట్లను కైవసం చేసుకొంది.  ఆ తర్వాతి స్థానంలో బీజేపీ నిలిచింది. గత ఏడాది డిసెంబర్ మాసంలో నిర్వహించిన ఎన్నికల్లో బీజేపీ 48 కార్పోరేటర్ స్థానాలను కైవసం చేసుకొంది.

అయితే ప్రమాణస్వీకారానికి ముందే అనారోగ్యంతో బీజేపీ కార్పోరేటర్ రమేష్ గౌడ్ మరణించాడు. దీంతో బీజేపీ కార్పోరేటర్ల సంఖ్య 47కి చేరుకొంది.  బీజేపీకి ఇద్దరు ఎక్స్‌ అఫిషియో సభ్యులున్నారు.మేయర్ పదవిని దక్కించుకొనే బలం బీజేపీకి లేదు.అయినా కూడ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు బీజేపీ పోటీ చేయనుంది.

మేయర్ అభ్యర్ధిగా రాధా ధీరజ్ రెడ్డి,  డిప్యూటీ మేయర్ అభ్యర్ధిగా రవిచారిలను బీజేపీ బరిలోకి దింపనుంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ కార్పోరేటర్లు  హైద్రాబాద్ బషీర్ బాగ్ లోని అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ ఆలయం నుండి పాదయాత్రగా జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకొన్నారు.బీజేపీ కార్పోరేటర్లు అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన తర్వాత ప్రతిజ్ఞ చేశారు..
 

click me!