మూత్రం ప్రాణం తీసింది.. బస్సు ఆపకపోవడంతో దూకి..

By AN TeluguFirst Published Feb 11, 2021, 9:17 AM IST
Highlights

కొన్నిసార్లు మృత్యువు ఎంత విచిత్రంగా పలకరిస్తుందో, ఎంతలా వెన్నంటి ఉంటుందో కొన్ని సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. బతుకు తెరువు కోసం పుట్టిపెరిగిన ఊరు వదిలి వేరే రాష్ట్రానికి బయల్దేరిన ఓ వ్యక్తిని కాలకృత్యం కర్షషంగా కాటేసింది. 

కొన్నిసార్లు మృత్యువు ఎంత విచిత్రంగా పలకరిస్తుందో, ఎంతలా వెన్నంటి ఉంటుందో కొన్ని సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. బతుకు తెరువు కోసం పుట్టిపెరిగిన ఊరు వదిలి వేరే రాష్ట్రానికి బయల్దేరిన ఓ వ్యక్తిని కాలకృత్యం కర్షషంగా కాటేసింది. 

మూత్రం ఆపుకోలేక పోవడం అతడి పాలిట మృత్యపాశంగా మారింది. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో మూత్రం రావడంతో, బస్సు ఆపాలని అడిగాడో వ్యక్తి. డ్రైవర్ ఆపేలోపే తెరిచి ఉన్న తలుపు నుంచి దూకి అక్కడిక్కడే చనిపోయాడు. ఈ విషాదకర ఘటన వికారబాద్ జిల్లాలో జరిగింది. 

హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి బస్సులోని వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొడంగల్ ఎస్సై ప్రభాకర్ రెడ్డి కథనం ప్రకారం.. దౌల్తాబాద్ మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పొలంసాయన్నోల రాములు(50) తాపీ మేస్త్రీగా పనిచేస్తాడు. 

బుధవారం సాయంత్రం ముంబై వెళ్లడానికి రావల్ పల్లి గ్రామం వద్ద బస్సు ఎక్కారు. భార్య మదారమ్మ ఆయనను బస్సు ఎక్కించి ఊరికి వెళ్లిపోయింది. బస్సు రావల్ పల్లి గ్రామం దాటి అరకిలోమీటర్ దూరం వెళ్లగానే.. రాములు మూత్రం వస్తోంది బస్సు ఆపాలని డ్రైవర్ ని అడిగాడు. 

డ్రైవర్ రోడ్డు పక్కన ఆపుతానని చెప్పాడు. బస్సు ఆపేలోగానే రాములు తెరచి ఉంచిన తలుపు లోంచి కిందికి దూకారు. బస్సు రన్నింగ్ లో ఉండడంతో తల నేలకు కొట్టుకుని తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
 

click me!