మూడో అంతస్తు నుండి భార్య, కూతురిని తోసేసిన భర్త: చిన్నారి మృతి

Published : Jun 19, 2019, 10:09 AM IST
మూడో అంతస్తు నుండి  భార్య, కూతురిని తోసేసిన భర్త: చిన్నారి మృతి

సారాంశం

హైద్రాబాద్ నగర శివారులోని మల్లాపూర్‌లో కుటుంబ తగాదాలతో  భార్యతో పాటు చిన్నారిని మూడో అంతస్తు నుండి కిందకు తోశాడు. ఈ ఘటనలో  చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, భార్య మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.  


హైదరాబాద్: హైద్రాబాద్ నగర శివారులోని మల్లాపూర్‌లో కుటుంబ తగాదాలతో  భార్యతో పాటు చిన్నారిని మూడో అంతస్తు నుండి కిందకు తోశాడు. ఈ ఘటనలో  చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, భార్య మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

మంగళవారం రాత్రి భార్యతో భర్త యోగేష్  గొడవపడ్డారు. ఈ క్రమంలోనే భార్యను మూడో అంతస్తు నుండి  కిందకు నెట్టాడు. ఈ క్రమంలో కిందపడిన చిన్నారి సంఘటన స్థలంలోనే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన భార్యను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. 

స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని యోగేష్‌ను  అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert: అల్ప‌పీడ‌న ప్ర‌భావం.. ఈ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు ఖాయం
Kavitha: ఈసారి కేటీఆర్‌కు క‌విత రాఖీ క‌డ‌తారా లేదా.? అన్న‌పై చెల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు