మూసి ఉన్న దుకాణం ఎదుట బాలిక మృతదేహం మిస్టరీ...

By AN TeluguFirst Published Nov 6, 2021, 7:34 AM IST
Highlights

బాలిక పడి ఉన్నచోట రక్తపు మరకలు లేకపోవడంతో ఘటన ఇక్కడ జరగలేదని నిర్ధారణకు వచ్చారు.  ఎక్కడో murder చేసి, గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడ పడేసి ఉంటారని అనుమానంతో సమీపంలోని దాదాపు వందకుపైగా కెమెరాల ఫుటేజీని పరిశీలించినా ఎలాంటి పురోగతి కనిపించలేదు.  

నారాయణగూడ :  నాలుగైదేళ్ల వయసున్న బాలిక అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం దీపావళి రోజు (గురువారం) ఉదయం జేవీఆర్ పార్కు ఎదుట ద్వారకపురి కాలనీలోని  మూసిఉన్న దుకాణం ఎదుట బాలిక అచేతనంగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చారు.

పంజాగుట్ట పోలీసులు dead bodyని పరిశీలించారు.  బాలిక పడి ఉన్నచోట రక్తపు మరకలు లేకపోవడంతో ఘటన ఇక్కడ జరగలేదని నిర్ధారణకు వచ్చారు.  ఎక్కడో murder చేసి, గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడ పడేసి ఉంటారని అనుమానంతో సమీపంలోని దాదాపు వందకుపైగా కెమెరాల ఫుటేజీని పరిశీలించినా ఎలాంటి పురోగతి కనిపించలేదు.  

child మృతదేహంపై పాత గాయాలున్నాయని,  అత్యాచారం జరిగిన దాఖలాలు లేవని పశ్చిమ మండలం జాయింట్ కమిషనర్ ఏ ఆర్ శ్రీనివాస్ శుక్రవారం వెల్లడించారు. *రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా missing case వివరాలు పరిశీలిస్తున్నాం? పోస్టుమార్టం నివేదిక ఆధారంగా... బాలిక ఎప్పుడు? ఎలా మరణించింది? శరీరంపై ఇంకా ఏమైనా గాయాలు ఉన్నాయా? అనేది తెలుస్తుంది. రెండు రోజుల్లో నిందితులను గుర్తిస్తాం.’ అని ఆయన తెలిపారు.

 రాష్ట్రంలోని అన్నిఠాణాలతో పాటు... సామాజిక మాధ్యమాల్లో బాలిక చిత్రాన్ని విడుదల చేసినట్టు చెప్పారు.  బాలిక గురించి సమాచారం తెలిస్తే ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి (9490616610),  డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నాగయ్య(9490616613), ఎస్సై సతీష్ (9490616365)లకు తెలియజేయాలని కోరారు. క్షుద్రపూజల కోసం ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

హైదరాబాద్: సదర్ పండుగలో అపశృతి.. తాడు తెంపుకుని జనాల మీదుకొచ్చిన దున్నపోతు

హైదరాబాద్ లో మరో దారుణం..

Hyderabad లోని జూబ్లీహిల్స్‌లోని ఓ బట్టల దుకాణంలోని Trial Room లో యువతి బట్టలు మార్చుకొంటున్న సమయంలో ఇద్దరు యువకులు Cell phone తో  ఈ దృశ్యాలను చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన యువతి పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో  ఇద్దరు యువకులతో పాటు వస్త్ర దుకాణం మేనేజర్ ను jubilee hills  పోలీసులు అరెస్ట్ చేశారు.

జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రముఖ వస్త్ర దుకాణంలోని ట్రయల్ రూమ్ లో యువతి డ్రెస్ కొనుగోలు చేసేందుకు శుక్రవారం నాడు వచ్చింది., డ్రెస్ తనకు సరిపోతోందో లేదో చూసుకొనేందుకు ట్రయల్ రూమ్ కు వెళ్లింది. ఈ ట్రయల్ రూమ్ కు పక్కనే పురుషుల ట్రయల్ రూమ్ ఉంది. ట్రయల్ రూమ్ పైన ఉన్న ఖాళీ ప్రదేశం నుండి ఇద్దరు యువకులు యువతి డ్రెస్ మార్చుకొంటున్న దృశ్యాలను తమ ఫోన్ లో రికార్డు చేయడం ప్రారంభించారు.ఈ విషయాన్ని గుర్తించిన యువతి అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ షోరూమ్‌కి వచ్చి నిందితుల నుండి మొబైల్ ను స్వాధీనం చేసుకొని వీడియోను డిలీట్ చేశారు. ఈ ఇద్దరు నిందితులతో పాటు షోరూమ్ మేనేజర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ షోరూమ్‌కి దుస్తులు కొనుగోలు చేసేందుకు నిందితులు ఇద్దరు వచ్చినట్టుగా పోలీసులు చెప్పారు. 

షోరూమ్‌లలోని ట్రయల్ రూమ్స్ లో మహిళలు బట్టలు మార్చుకొంటున్న సమయంలో రికార్డు చేస్తే రికార్డు చేసిన వారితో పాటు షోరూమ్ నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేస్తామని జూబ్లీహిల్స్ ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు.

click me!