హైదరాబాద్: సదర్ పండుగలో అపశృతి.. తాడు తెంపుకుని జనాల మీదుకొచ్చిన దున్నపోతు

By Siva KodatiFirst Published Nov 5, 2021, 8:51 PM IST
Highlights

హైదరాబాద్‌లో (hyderabad) సదర్‌ ఉత్సవం (sadar festival ) సందర్భంగా ఖైరతాబాద్‌లో (khairatabad) అపశ్రుతి చోటు చేసుకుంది.ఖైరతాబాద్‌ కూడలిలో సదర్‌ ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా తీసుకొచ్చిన దున్నపోతును ముస్తాబు చేస్తుండగా.. అది తాడు తెంపుకొని జనాల మీదకి  దూసుకొచ్చింది

హైదరాబాద్‌లో (hyderabad) సదర్‌ ఉత్సవం (sadar festival ) సందర్భంగా ఖైరతాబాద్‌లో (khairatabad) అపశ్రుతి చోటు చేసుకుంది. యాదవ సంఘం (yadava sangam) ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌ కూడలిలో సదర్‌ ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా తీసుకొచ్చిన దున్నపోతును ముస్తాబు చేస్తుండగా.. అది తాడు తెంపుకొని జనాల మీదకి  దూసుకొచ్చింది. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు కాగా, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎట్టకేలకు నిర్వాహకులు స్పందించి దున్నపోతును శాంతింపజేశారు. అనంతరం దానిని చింతల్‌బస్తీ నుంచి ఖైరతాబాద్‌ సమ్మేళనానికి తీసుకొచ్చారు. దున్నపోతు వీరంగంతో కాసేపు ఖైరతాబాద్‌లో ట్రాఫిక్‌ స్తంభించింది.  

కాగా.. Hyderabad నగరంలో Narayanaguda, ఖైరతాబాద్, కాచిగూడ, సైదాబాద్, బోయిన్‌పల్లి, ఈస్ట్ మారేడ్ పల్లి, చప్పల్ బజార్, మధురాపురి, కార్వాన్, నార్సింగ్, ఓల్డ్ సిటీ, మరికొన్ని ప్రాంతాల్లో సదర్ ఉత్సవాలు జరగనున్నాయి. ప్రతియేటా దీపావళి తర్వాత నగరంలోని యాదవ్‌లు సదర్ ఉత్సవాలను ఉల్లాస ఉత్సాహాలతో నిర్వహిస్తుంటారు. ఖరీదైన దున్నపోతులను ప్రదర్శనకు పెడతారు. వాటిని అలంకరించి ఊరేగిస్తారు. వీటి వెంట కుర్రకారు ఈలలు, డ్యాన్సులు, మ్యూజిక్కులతో ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటారు. ప్రతియేటా నిర్వహించే ఈ సదర్ ఉత్సవాల్లో నారాయణగూడలో నిర్వహించే సంబురాలు హైలైట్‌గా నిలుస్తుంటాయి. ఈ నెల 5వ తేదీన ఖైరతాబాద్, ఎల్లారెడ్డి గూడ, లాల్ బజార్, మరికొన్ని ప్రాంతాల్లో సదర్ సంబురాలు ప్రారంభం కానున్నాయి. కాగా, నారాయణగూడ సదర్ Celebrations మరుసటి రోజు అంటే 6వ తేదీన జరగనున్నాయి.

ALso Read:సదర్ ఉత్సవాలకు సర్వం సిద్ధం.. రేపు సాయంత్రం సంబురాలు షురూ

అయితే, ఈ సారి ఖైరతాబాద్‌లోనూ ఎంతమాత్రం తగ్గకుండా సదర్ ఉత్సవాలకు ప్లాన్ చేస్తున్నారు. నారాయణగూడ కంటే మించి ఉత్సవాలు నిర్వహించాలని యోచిస్తున్నారు. సదర్ కోసం నగరంలోని యాదవ్‌లు పంజాబ్, హర్యానాల నుంచి దున్నరాజులను కొని తెస్తుంటారు. ఉత్సవాలకు ముందుగానే తెచ్చి వాటికి నాణ్యమైన దానా పెట్టి బలిష్టంగా తయారుచేస్తారు. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడ్డ తర్వాత డ్రైఫ్రూట్స్, అరటి పండ్లు, పాలు వంటి పౌష్టికాహారం అందిస్తారు. దున్నపోతుల వీపులపై వెంట్రుకలు లేకుండా
చేస్తారు. ఆవాల నూనెతో మర్దన చేస్తారు. 

Haryana నుంచి 16 కోట్లు వెచ్చించి తెచ్చిన దున్నలను ముషీరాబాద్‌లో పెంచుతున్నట్టు అఖిల భారత యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి, టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ వివరించారు. వీటి పేర్లు కింగ్, సర్తాజ్‌లు. ఈ దున్నరాజులను నారాయణగూడ సదర్‌లో ప్రదర్శించనున్నారు. కాగా, ఖైరతాబాద్‌లో రూ. 30 కోట్లతోషారూఖ్, రూ. 25 కోట్లతో లవ్రాణాలను తెచ్చి పెంచుతున్నారు.

click me!