కేసీనో వ్యాపారం నిర్వహించిన చీకోటి ప్రవీణ్ సోమవారంనాడు ఈడీ అధికారుల విచారణకు హాజరయ్యారు.
హైదరాబాద్: Casino వ్యాపారం నిర్వహించిన Chikoti Praveen సోమవారం నాడు ఉదయం Hyderabad లోని Enforcement Directorate కార్యాలయానికి చేరుకొన్నారు. ఈ ఏడాది జూన్ 27 నుండి 28వ తేదీ వరకు నిర్వహించిన సోదాల్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు ప్రవీణ్ ను ప్రశ్నించనున్నారు. ప్రవీణ్ తో పాటు Madhava Reddy మరో ఇద్దరిని కూడా విచారణకు రావాలని ఈడీ అధికారులు Notices పంపారు. అయితే ఈడీ కార్యాలయానికి తొలుత ప్రవీణ్ మాత్రమే హాజరయ్యారు. బ్యాంకు స్టేట్ మెంట్ తో పాటు న్యాయవాదిని తీసుకొని ప్రవీణ్ విచారణకు హాజరయ్యారు.ఈడీ నోటీసులు అందుకున్న మరో నలుగురు కూడా ఆ తర్వాత విచారణకు హాజరయ్యారు.
అయితే ప్రవీణ్ ను మాత్రమే ఈడీ అధికారులు విచారణ చేసే గదిలోకి అనుమతిచ్చారు. ప్రవీణ్ న్యాయవాది విచారణ జరిగే గది బయటే ఉన్నారు. అయితే మాధవరెడ్డి, సంపత్ లు ఇంకా విచారణకు హాజరు కాలేదు.
undefined
హవాలా రూపంలో ప్రవీణ్ డబ్బులను తరలించారని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ ప్రసారం చేసింది. బిగ్ డాడీ అడ్డా కోసం సినీ తారులతో కూడా చీకోటి ప్రవీణ్ ప్రమోషన్ చేయించాడు. సినీ తారలకు ఈ ప్రమోషన్ విషయమై భారీగానే డబ్బులు ముట్ట జెప్పారని ఈడీ అధికారులు గుర్తించారు.
ఏడు మాసాల్లో ఏడు దేశాల్లో ప్రవీణ్ కేసినో నిర్వహించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. నేపాల్ సహా మరో ఆరు దేశాల్లో ప్రవీణ్ కేసినో నిర్వహించారు. హైద్రాబాద్ నుండి విమానాల్లో సుమారు వెయ్యి మందికి పైగా తీసుకెళ్లి కేసినో ఆడించారని ఈడీ అధికారులు గుర్తించారని ఈ చానెల్ కథనం తెలిపింది.
ప్రవీణ్ నుండి స్వాధీనం చేసుకున్న లాప్ టాప్, మొబైల్స్ నుండి ఈడీ అధికారులు కీలకమైన సమాచారం సేకరించారు. పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలతో ప్రవీణ్ కు సంబంధాలున్నట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు.

also read:30 గంటలుగా ఈడీ సోదాలు:హైద్రాబాద్ లో రైల్వే కాంట్రాక్టర్ ఫరూక్ ఇంట్లో తనిఖీలు
ప్రవీణ్ తో సంపత్ అనే వ్యక్తికి ఉన్న సబంధాలపై కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రవీణ్ పుట్టిన రోజున సంపత్ రూ. 2 కోట్లు ఖర్చు చేశాడు. ప్రవీణ్ విదేశాలకు తీసుకెళ్లిన వారికి సఃంపత్ టికెట్లను బుక్ చేశారు. విమాన టికెట్లతో పాటు విమానాలను సంపత్ బుక్ చేసినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారని ఎన్టీవీ కథనం వివరించింది.ప్రవీణ్ తో టచ్ లో ఉన్న రాజకీయ ప్రముఖులు, వీవీఐపీలు లోలోపల ఆందోళన చెందుతున్నారు. ఈడీ విచారనలో ప్రవీణ్ ఏం చెబుతారోననే ఆందోళన నెలకొంది.