బీజేపీలో చేరే నాయకుల జాబితాతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో బృందం సోమవారం నాడు ఢిల్లీకి చేరింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఇతర కీలక నేతలతో సమావేశం కానున్నారు.
హైదరాబాద్: పార్టీలో చేరికలపై తెలంగాణ BJP నేతలు దృష్టిని పెట్టారు. బీజేపీలో ఇతర పార్టీల నేతల చేరికపై మాజీ మంత్రి Etela Rajender నేతృత్వంలో కూడా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులు ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరే నేతల విషయమై చర్చించనున్నారు. ఈటల రాజేందర్ తో పాటు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న మాజీ మంత్రి DK Aruna కూడా ఢిల్లీకి వెళ్లారు.
మునుగోడు ఎమ్మెల్యే Komatireddy Rajagopal Reddy కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించేందుకు Congress పార్టీ నాయకత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది. అయితే ఈ విషయమై మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రంగంలోకి దింపింది.
undefined
గత మాసంలోనే Munugode MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. పార్టీ మార్పు చారిత్రక అవసరమని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం కూడా ప్రధానంగా చర్చకు దారితీసింది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే విషయమై ఈటల రాజేందర్ నేతృత్వంలోని బృందం బీజేపీ జాతీయ నాయకత్వంతో చర్చించే అవకాశం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే మునుగోడు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.ఈ విషయమై కూడా పార్టీ అగ్రనాయకత్వంతో కూడా బీజేపీ నేతలు చర్చించనున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఇతర నేతలు కూడా బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న కమలనాథులు చెబుతున్నారు. ఆయా నేతలకు చెందిన ప్రొఫైల్స్ ను కూడ ఈటల రాజేందర్ నేతృత్వంలోని బృందం పార్టీ అగ్రనాయకత్వానికి అందించనుంది.
ఆయా నేతలు బీజేపీలో చేరడం వల్ల పార్టీకి ఏ రకమైన ప్రయోజనం కలుగుతుందనే విషయాన్ని కూడా నేతలు వివరించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షించే నేత బీఎల్ సంతోష్ తో పాటు ఇతర నేతలతో కూడా ఈటల రాజేందర్ నేృత్వంలోని బృందం కలవనుంది., టీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలతో పాటు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల జాబితాను కూడా ఈటల రాజేందర్ నేతృత్వంలోని బృందం బీజేపీ అగ్రనాయకత్వానికి అందించనుందని సమాచారం.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay ఈ నెల 2వ తేదీనుండి ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడతను ప్రారంభించనున్నారు.దీంతో బండి సంజయ్ ఈ సమావేశానికి Delhiవెళ్లలేదు. అయితే బీజేపీ జాాతీయ నాయకులతో జరిగే సమావేశానికి బండి సంజయ్ వర్చువల్ గా సమావేశం కానున్నారు.
బీజేపీ జాతీయ నాయకత్వం నుండి అనుమతి రాగానే బీజేపీ నాయకులు రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్ ను మరింత వేగవంతం చేయనున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ నేతలు చెబుతున్నారు.ఈ తరుణంలో కీలకమైన కాంగ్రెస్ పార్టీ నేతలను తమ పార్టీలో చేర్చుకోవాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఇదే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీ చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని సమాచారం.