ఢీల్లీకి జానారెడ్డి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ పై చర్చ

By narsimha lodeFirst Published Aug 1, 2022, 11:13 AM IST
Highlights


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి సోమవారం నాడు ఢీల్లి వెళ్లనున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే అంశంతో పాటు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో జానారెడ్డి చర్చించనున్నారు. 

హైదరాబాద్: Congress  పార్టీ సీనియర్ నేత Jana Reddy సోమవారం నాడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన Hyderabadనుండి New Delhi కి వెళ్తారు. . కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహరాల ఇంచార్జీ  కేసీ వేణుగోపాల్ తో పాటు ఇతర అగ్రనేతలతో జానారెడ్డి భేటీ కానున్నారు.  రాష్ట్రంలో పార్టీ పరిస్థితితో పాటు రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే Komatireddy Rajagopal Reddy బీజేపీలో చేరుతారనే ప్రచారం విషయమై కూడా ఆయన చర్చించే అవకాశం ఉంది.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి BJP లో చేరే అవకాశం ఉంది.ఈ విషయమై కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి రంగం సిద్దం చేసుకొంటున్నారు. ఈ తరుణంలో రాజగోపాల్ రెడ్డిని పార్టీలోనే ఉండేలా అగ్ర నాయకత్వం కూడా పావులు కదుపుతుంది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ , నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో చర్చలు జరిపే బాధ్యతను కేసీ వేణుగోపాల్ అప్పగించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో దిగ్విజయ్ సింగ్ గత వారంలో ఫోన్ లో మాట్లాడారు. ఢిల్లీకి రావాలని సూచించారు. ఢిల్లీలో చర్చిస్తానని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఈ ఫోన్ చేసిన తర్వాత రెండు రోజుల క్రితం నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో చర్చించారు. అంతకుముందు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కూడా చర్చించారు.  

ఒకవైపు పార్టీ నేతలతో చర్చిస్తూనే పార్టీ పై విమర్శలు గుప్పిస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. Telanganaలో KCR కుటుంబ పాలనకు చరమ గీతం పాడేందుకు గాను  తన వంతు ప్రయత్నం చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.  అదే సమయంలో పార్టీ మార్పు చారిత్క అవసరమని కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ పాలనకు చరమ గీతం పాడేందుకు తమ వంతు సహకారం అందించకపోతే చరిత్ర హీనులుగా మారే అవకాశం ఉందని  రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.

ఇదిలా ఉండగా ఉమ్మడి Nalgonda  జిల్లాలోని పార్టీ నేతలతో మాట్లాడాలని డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను పార్టీ నాయకత్వం ఆదేశించింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారితే పార్టీ నేతలు ఎవరూ కూడా రాజగోపాల్ రెడ్డితో వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. 

ఇవాళ సాయంత్రం ఢిల్లీలో జరిగే కేసీ వేణుగోపాల్ తో జరిగే చర్చల్లో జానారెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క,నల్గొండ, భువనగిరి ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు కూడా పార్టీ నాయకత్వం నుండి ఆహ్వానం అందింది.
 

click me!