టీఆర్ఎస్‌లో చెన్నూరు టిక్కెట్టు చిచ్చు: స్వీయ నిర్బంధంలో ఓదేలు

By narsimha lodeFirst Published 11, Sep 2018, 11:29 AM IST
Highlights

సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్  తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కుటుంబసభ్యులతో కలిసి  చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు మంగళవారం నాడు  ఇంట్లోనే స్వయంగా గృహా నిర్భంధం చేసుకొన్నాడు.

చెన్నూరు: సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్  తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కుటుంబసభ్యులతో కలిసి  చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు మంగళవారం నాడు  ఇంట్లోనే స్వయంగా గృహా నిర్భంధం చేసుకొన్నాడు.

తాజాగా కేసీఆర్ ప్రకటించిన టిక్కెట్ల జాబితాలో చెన్నూరు నుండి ఓదేలుకు టిక్కెట్టు దక్కలేదు. చెన్నూరు నుండి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ను టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దింపుతున్నట్టు కేసీఆర్ ప్రకటించారు.

దీంతో ఓదేలు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కేసీఆర్ తనకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఓదేలు  కుటుంబసభ్యులతో కలిసి  ఇంట్లో గృహ నిర్భందానికి పాల్పడ్డాడు.  తనకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు.

చెన్నూరు టిక్కెట్టును తనకే కేటాయించాలని కోరుతున్నాడు.  ఈ విషయమై కేసీఆర్‌తో మాట్లాడేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరుతున్నారు.మరో వైపు ఓదేలు ఇంటి బయట ఆయన అనుచరులు  ఆందోళన నిర్వహిస్తున్నారు. 

ఈ వార్తలు చదవండి

టిక్కెట్ కట్: కేసీఆర్‌తో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు భేటీ
సిట్టింగ్ సీటు కోల్పోయిన మాజీ జర్నలిస్ట్: ఆంథోల్ లో క్రాంతికి సీటు

కేసీఆర్ కు తలనొప్పి: సిట్టింగ్ లపై తిరుగుబాట్లు

Last Updated 19, Sep 2018, 9:22 AM IST