రైలు బాత్రూమ్‌లో వేలాడుతున్న శవం.. పరిగెత్తిన ప్రయాణికులు

Published : Sep 11, 2018, 10:48 AM ISTUpdated : Sep 19, 2018, 09:22 AM IST
రైలు బాత్రూమ్‌లో వేలాడుతున్న శవం.. పరిగెత్తిన ప్రయాణికులు

సారాంశం

ఆత్మహత్య చేసుకోవాలని అనుకునేవారికి రైళ్లు కూడా కేంద్రాలుగా మారుతున్నాయి. తాజాగా మధురై-కాచిగూడ రైలులో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు

ఆత్మహత్య చేసుకోవాలని అనుకునేవారికి రైళ్లు కూడా కేంద్రాలుగా మారుతున్నాయి. తాజాగా మధురై-కాచిగూడ రైలులో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ వద్ద రైలులోని ఎస్-2 బోగిలో బాత్‌రూమ్‌కి వెళదామని కొందరు ప్రయాణికులు వచ్చారు.

అయితే వాష్‌రూమ్ తలుపు వేసి ఉండటంతో బయటి నుంచి చూశారు.. అందులో ఓ గుర్తు తెలియని వ్యక్తి వేలాడుతూ కనిపించడంతో వెంటనే ప్రయాణికులు టీటీకి సమాచారం అందించారు. రైలు కాచిగూడకు వచ్చిన తర్వాత రైల్వే పోలీసులు బాత్‌రూమ్ తలుపులు తీసి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు.

మృతదేహన్ని కిందకి దించి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతని వద్ద టికెట్ లేకపోవడంతో ఏ స్టేషన్లో ఎక్కాడో.. ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తో గుర్తించడం కష్టంగా మారింది. 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే