కేసీఆర్ జాతీయ పార్టీతో రాజకీయ సమీకరణాల్లో మార్పులు:ఎర్రబెల్లి దయాకర్ రావు

By narsimha lode  |  First Published Oct 3, 2022, 3:10 PM IST

కేసీఆర్ ఏర్పాటు చేయనున్న జాతీయ పార్టీతో ఇతర రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో మార్పులు వస్తాయని టీఆర్ఎస్ అభిప్రాయపడుతుంది. ఆయా పార్టీల్లోని అసంతృప్తులు కేసీఆర్ ఏర్పాటు చేసే పార్టీలో చేరుతారని  తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్  రావు చెప్పారు.


హైదరాబాద్: కేసీఆర్ ఏర్పాటు చేయనున్న జాతీయ పార్టీతో ఇతర రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాల్లో మార్పులు వస్తాయని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. సోమవారం నాడు హైద్రాబాద్ లో మంత్రి దయాకర్ రావు మీడియాతో చిట్ చాట్ చేశారు. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో అసంతృప్తులు బయటకు వస్తారని ఆయన చెప్పారు. కేసీఆర్ ఏర్పాటు చేసే కొత్త జాతీయ పార్టీతో  ఏదో సాధించలేకపోయినా మార్పు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.తాము  ఆశించిన స్థాయిలో కాకపోయినా రాష్ట్రానికి ఓ ఎంపీ, ఎమ్మెల్యే గెలిచినా టార్గెట్ ను అందుకున్నట్టేనని దయాకర్ రావు చెప్పారు. 

ఈ నెల 5వ తేదీన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ పార్టీ నేతలకు వివరించనున్నారు. టీఆర్ఎస్ పేరును మార్చనున్నారు. జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్  పేరు తెలంగాణకు మాత్రమే ఉద్దేశించింది.  టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ లేదా  మరో పేరును కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఈ నెల 5వ తేదీన కేసీఆర్ ప్రకటన చేయనున్నారు. 

Latest Videos

undefined

also read:దసరా రోజున యధావిధిగా టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం: కేసీఆర్

జాతీయపార్టీ జెండా, ఎజెండాకు సంబంధించి కేసీఆర్ ఇప్పటికే కసరత్తును పూర్తి చేశారు.కొంత కాలంగా ఫామ్ హౌస్ వేదికగా  జాతీయ పార్టీ ఏర్పాట విషయమై పార్టీకి చెందిన ముఖ్యులతో కేసీఆర్ చర్చిస్తున్నారు. మేథావులు, జర్నలిస్టులు, రిటైర్డ్  ఐఎఎస్  అధికారులతో కేసీఆర్ చర్చలు జరిపారు. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలకు చెందిన నేతలు, సీఎంలతో కేసీఆర్ గతంలోచర్చలు జరిపారు.ఈ చర్చలను కొనసాగిస్తున్నారు. గత మాసంలో జేడీఎస్ నేత కుమారస్వామి కేసీఆర్ తో భేటీ అయ్యారు.

click me!