ఇందిరా గాంధీపై కేసీఆర్ వ్యాఖ్యలు .. హరిత విప్లవం తెచ్చిందెవరంటూ ఖర్గే కౌంటర్

By Siva Kodati  |  First Published Nov 22, 2023, 6:11 PM IST

మోడీతో అంటకాగడం తప్ప కేసీఆర్‌కు ఏం తెలియదన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.  పేదరిక నిర్మూలన కోసం ఇందిరమ్మ ఏం చేయలేదన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఖర్గే ఖండించారు. దేశంలో ఆహార ధాన్యాల కొరత తీర్చింది ఇందిరా గాంధీయేనని.. అలాంటి ఆమెను కేసీఆర్ తిడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 


మోడీతో అంటకాగడం తప్ప కేసీఆర్‌కు ఏం తెలియదన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నల్గొండలో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లేకుంటే తెలంగాణ ఎలా వుండేదని ప్రశ్నించారు. మోడీ , కేసీఆర్ ఒక్కటేనని వారిద్దరికీ పేదల కష్టాల పట్టవని, రైతులకు న్యాయం చేయడమే ఇందిరమ్మ రాజ్యమని ఖర్గే పేర్కొన్నారు. దేశంలో ఆహార ధాన్యాల కొరత తీర్చింది ఇందిరా గాంధీయేనని.. అలాంటి ఆమెను కేసీఆర్ తిడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పేదరిక నిర్మూలన కోసం ఇందిరమ్మ ఏం చేయలేదన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఖర్గే ఖండించారు. రైతులకు న్యాయం చేయడమే ఇందిరమ్మ రాజ్యమని.. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం బాగుపడుతుందన్నారు. సోనియా తెలంగాణను ఇచ్చారని, కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని ఖర్గే చెప్పారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరిపై కేసీఆర్ రూ.1,40,000 అప్పు చేశారని.. హరిత విప్లవం, శ్వేత విప్లవం వచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడ వున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో 2 లక్షల పోస్టులు ఖాళీగానే వున్నప్పటికీ కేసీఆర్ భర్తీ చేయలేదని మల్లిఖార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. 

Latest Videos

click me!