ఖమ్మం నుండి బాబు, రాహుల్ ఎన్నికల ప్రచారం

Published : Nov 23, 2018, 01:20 PM IST
ఖమ్మం నుండి బాబు, రాహుల్ ఎన్నికల ప్రచారం

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 28వ తేదీ నుండి  రెండు రోజుల పాటు  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీలు తెలంగాణలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తారు. ఖమ్మం జిల్లా నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.  

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 28వ తేదీ నుండి  రెండు రోజుల పాటు  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీలు తెలంగాణలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తారు. ఖమ్మం జిల్లా నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ను గద్దె దించేందుకు గాను కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, టీజేఎస్ లు పీపుల్స్ ఫ్రంట్‌గా ఏర్పడ్డాయి. ఈ ఫ్రంట్ ‌ తరపున కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడులు విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. వీరిద్దరూ కలిసి ఒకే వేదిక ద్వారా టీఆర్ఎస్ ను ఓడించాలని ప్రజలను కోరనున్నారు.

ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహించే ఎన్నికల సభ ద్వారా  వీరిద్దరి  ఎన్నికల సభ ప్రారంభం కానుంది.  అదే రోజు మధ్యాహ్నం తాండూరులో నిర్వహించే సభలో కూడ  పాల్గొంటారు. సాయంత్రం హైద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రోడ్‌షో‌లు నిర్వహిస్తారు. 

ఈ నెల 29వ తేదీ ఉదయం కూడ రాష్ట్రంలోని  ఏ జిల్లాల్లో సభలు నిర్వహించాలనే దానిపై  ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  అదే రోజు సాయంత్రం రంగారెడ్డి, హైద్రాబాద్ జిల్లాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు.


సంబంధిత వార్తలు

రంగంలోకి బాబు: రాహుల్‌తో పాటు తెలంగాణలో ప్రచారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ఒకే వేదిక‌ పైకి రాహుల్, బాబు

ప్రజాస్వామ్య రక్షణకు కలుస్తున్నాం: చంద్రబాబు

ప్రధాని ఎవరనేది అప్పుడే: దేవేగౌడతో భేటీ తర్వాత బాబు

బీజేపీయేతర ఫ్రంట్: దేవేగౌడ‌, కుమారస్వామిలతో బాబు భేటీ

బాబు ఫ్రంట్‌: ధర్మపోరాట దీక్షకు బీజేపీయేతర పార్టీలు

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!