RTC Strike:చలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో నేతల అరెస్ట్‌లు, ట్రాఫిక్ ఆంక్షలు

By narsimha lodeFirst Published Nov 9, 2019, 8:01 AM IST
Highlights

ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం తలపెట్టిన చలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి పోలీసులు అనుమతించలేదు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జేఎసీ ప్రకటించింది.ఈ కార్యక్రమానికి పలు పార్టీలు మద్దతును ప్రకటించాయి.

హైదరాబాద్:ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమానికి శనివారం నాడు పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికుల చలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Also Read:ఆర్టీసీ ప్రైవేటీకరణపై హైకోర్టులో కేసీఆర్ కు చుక్కెదురు!

ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే రహదారులను మూసివేశారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాల దారులు వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.ఆర్టీసీ జేఎసీ నేతల చలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి కాంగ్రెస్, లెఫ్ట్, టీజేఎస్ నేతలు మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడ నేతలను కూడ ముందు జాగ్రత్తగా అదుపులోకి తీసుకొన్నారు పోలీసులు.

Also Read:chalo tankbund : ఆర్టీసీ కార్మిక జేఏసీ నేత రాజిరెడ్డి అరెస్ట్

హైద్రాబాద్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలను అర్దరాత్రే పోలీసులు అరెస్ట్ చేశారు.కాంగ్రెస్ నేత విక్రమ్ గౌడ్‌ను పోలీసులు అర్ధరాత్రి 12 గంటలకు ఆయన ఇంట్లోకి వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విక్రమ్‌గౌడ్‌ను జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

మరో వైపు జిల్లాల నుండి హైద్రాబాద్‌కు వచ్చే రహదారులంటిపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ జేఎసీ చలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి మద్దతిచ్చిన పార్టీల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొంటున్నారు.

Also Read:ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ సమీక్ష: హైకోర్టు తీర్పులపై చర్చ

చలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి పోలీసులు అనుమతివ్వలేదు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆర్టీసీ జేఎసీ ప్రకటించింది. ఆర్టీసీ జేఎసీ కో కన్వీనర్ రాజిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆర్టీసీ జేఎసీతో పాటు చలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి మద్దతిచ్చిన పార్టీల నేతలు కొందరు పోలీసులకు చిక్కకుండా ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ప్రగతి భవన్ వద్ద ఏబీవీపీ ముట్టడి, కాంగ్రెస్ ముట్టి కార్యక్రమం సందర్భంగా భద్రత వైఫల్యంతో ఆసిఫ్ నగర్ ఏసీపీ నంద్యాల నర్సింహరెడ్డిపై డీజీపీ వేటేశారు. అయితే ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు గాను శనివారం నాడు ఉదయం నుండే పోలీసులు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను మూసివేశారు.


 

click me!