Chalo Tank Bund: : ఎంపీ సంజయ్ అరెస్ట్, టియర్ గ్యాస్ ప్రయోగం

By narsimha lodeFirst Published Nov 9, 2019, 2:03 PM IST
Highlights

చలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు ఒకేసారి ట్యాంక్ బండ్ పైకి చేరుకొన్నారు. దీంతో ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 

హైదరాబాద్:చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో భాగంగా శనివారం నాడు మధ్యాహ్నం ఆర్టీసీ కార్మికులు ఒక్కసారే ట్యాంక్‌బండ్‌పైకి వచ్చారు. వందలాది మంది ఆర్టీసీ కార్మికులు  వచ్చి బారికేడ్లను, ముళ్ల కంచెను దూసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులతో ఆర్టీసీ కార్మికుల మధ్య తోపులాట చోటు చేసుకొంది.

Also Read:ఆర్టీసీ ప్రైవేటీకరణపై హైకోర్టులో కేసీఆర్ కు చుక్కెదురు!

తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ జేఎసీ చలో ట్యాంక్‌బండ్‌కు శనివారం నాడు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వ లేదు.

ట్యాంక్‌బండ్‌వైపు వెళ్లే  అన్ని దారులపై పోలీసులు బారికేడ్లను, ముళ్లకంచెను ఏర్పాటు చేశారు.  అయితే ట్యాంక్‌బండ్‌కు సమీపంలోని ఓ ఇంట్లో ఉన్న సుమారు వెయ్యి మందికి పైగా ఆర్టీసీ కార్మికులు ఒకేసారిగా ట్యాంక్‌బండ్‌పైకి తోసుకొంటూ వచ్చారు.

Also Read:chalo tankbund : ఆర్టీసీ కార్మిక జేఏసీ నేత రాజిరెడ్డి అరెస్ట్

రాణిగంజ్ వైపు నుండి ట్యాంక్ బండ్‌ పైకి వచ్చారు. పోలీసుల అటెన్షన్‌ను మరల్చి ట్యాంక్ బండ్‌పై ఉన్న విగ్రహల వద్ద బైఠాయించి నిరసనకు దిగారు. అంబేద్కర్ విగ్రహం నుండి వెంకటస్వామి విగ్రహం మధ్య ఆర్టీసీ కార్మికులు బైఠాయించారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆర్టీసీ కార్మికులు పోలీసుల కళ్లుగప్పి  ట్యాంక్‌బండ్‌పైకి వచ్చారు. ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనమంతరావులను హిమాయత్‌నగర్  వద్ద అరెస్ట్ చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ బైక్ పై వస్తున్న సమయంలో పోలీసులు ఆయనను గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.

లోయర్‌ ట్యాంక్ బండ్, ఇందిరాపార్క్ వైపు ఆర్టీసీ కార్మికులు దూసుకువెళ్లారు. ఆర్టీసీ కార్మికులను అడ్డుకొనేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. 

బారికేడ్లను దాటి వచ్చిన ఆర్టీసీ కార్మికులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. పోలీసులపై  ఆర్టీసీ కార్మికులు రాళ్లు రువ్వారు, ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. లిబర్టీ, సచివాలయం, ట్యాంక్ బండ్ వద్ద పోలీసులు పలువురు ఆర్టీసీ కార్మికులపై లాఠీచీర్జీ చేశారు. ఈ లాఠీ చార్జీలో ఆర్టీసీ కార్మికులకు గాయాలయ్యాయి.

లిబర్టీ, సచివాలయం, ట్యాంక్ బండ్ వద్ద పోలీసులు పలువురు ఆర్టీసీ కార్మికులపై లాఠీచీర్జీ చేశారు. ఈ లాఠీ చార్జీలో ఆర్టీసీ కార్మికులకు గాయాలయ్యాయి.ఆర్టీసీ కార్మికులు ట్యాంక్ బండ్‌పైకి వచ్చేందుకు ప్రయత్నించే అవకాశం ఉన్నందున రాణిగంజ్ చౌరస్తా వద్ద బారికేడ్లు, పోలీస్ వాహనాలను ఏర్పాటు చేశారు.

రాణిగంజ్, పికెట్ డిపోల నుండి పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు ట్యాంక్ బండ్‌పైకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. లిబర్టీ వైపు నుండి ఆర్టీసీ కార్మికులు ట్యాంక్‌బండ్‌ వైపుకు వచ్చేందుకు ప్రయత్నించారు. లిబర్టీ వద్ద ఆర్టీసీ కార్మికులు పోలీసులపై రాళ్లురువ్వారు.

సెక్రటేరియట్ వైపు నుండి ఆర్టీసీ కార్మికులు  ట్యాంక్ బండ్‌పైకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నేతృత్వంలో ఆర్టీసీ కార్మికులలను లిబర్టీ వద్ద పోలీసులు అడ్డుకొన్నారు.లిబర్టీ వద్ద ఆర్టీసీ కార్మిలకులపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు టియర్‌గ్యాస్‌ను కూడ ప్రయోగించారు.
 

click me!