
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రోహిత్ వేముల వర్థంతి సందర్భంగా వర్సిటీలో దళిత సంఘాలు సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాయి. అయితే ఈ సభకు అనుమతి లేదని వీసీ స్పష్టం చేశారు. అంతేకాదు వర్సిటీకీ బయటివారెవరినీ అనుమతించకుండా గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
అయితే వీసీ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. రోహిత్ వేముల మరణానికి కారణమైన వీసీని అరెస్టు చేయకుండా ప్రభుత్వం ఆయనను అవార్డులతో సత్కరించిందని ఇప్పుడు కనీసం రోహిత్ వర్థంతి సభను జరపడానికి కూడా వీసీ అనుమతించకపోవడం దారుణమని వ్యాఖ్యానించాయి.
వీసీ నిర్ణయాన్ని నిరసిస్తూ వర్సిటీ లోని దళిత విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.