తెలుగు అకాడమీ స్కాం: ముగ్గురి కోసం గాలింపు... ఇంటి దొంగలపై ఫోకస్ పెట్టిన సీసీఎస్

By Siva KodatiFirst Published Oct 3, 2021, 9:43 PM IST
Highlights

తెలుగు అకాడమీ కుంభకోణం కేసులో నిధుల తరలింపులో కీలకపాత్ర పోషించిన ముగ్గురి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వారిని రాజ్‌కుమార్, శ్రీనివాస్, సోమశేఖర్‌లుగా గుర్తించారు. నకిలీ ఆధారాలను రాజ్‌కుమార్ తయారు చేసినట్లు సీసీఎస్ పోలీసులు నిర్ధారించారు.

తెలుగు అకాడమీ కుంభకోణం కేసులో నిధుల తరలింపులో కీలకపాత్ర పోషించిన ముగ్గురి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వారిని రాజ్‌కుమార్, శ్రీనివాస్, సోమశేఖర్‌లుగా గుర్తించారు. నకిలీ ఆధారాలను రాజ్‌కుమార్ తయారు చేసినట్లు సీసీఎస్ పోలీసులు నిర్ధారించారు. వారిని రాజ్‌కుమార్, శ్రీనివాస్, సోమశేఖర్‌లుగా గుర్తించారు. నకిలీ ఆధారాలను రాజ్‌కుమార్ తయారు చేసినట్లు సీసీఎస్ పోలీసులు నిర్ధారించారు. మస్తాన్‌వలీ, సత్యనారాయణ కలిసి నిధులు మళ్లించినట్లు గుర్తించారు. ఏపీ, ముంబైతో పాటు హైదరాబాద్‌లోని కొంతమందికి అకాడమీ డబ్బులు చేర్చినట్లుగా తేల్చారు. ఎఫ్‌డీలను డ్రా చేయాలనే ఆలోచన మస్తాన్‌వలిదేనని సీసీఎస్ పోలీసులు అంటున్నారు.

ALso Read:తెలుగు అకాడమీ కుంభకోణం: సీసీఎస్ ఎదుట విచారణకు హాజరైన బ్యాంక్ సిబ్బంది

ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఇతర బ్యాంకులకు తరలించి.. మస్తాన్ వలీ గ్యాంగ్ డబ్బులు డ్రా చేసింది. 6 నెలల కాలంలో రూ.64 కోట్లు డ్రా చేసింది మస్తాన్ వలీ అండ్ కో. ఎఫ్‌డీలను డ్రా చేయడంలో అకాడమీకి చెందిన వ్యక్తులు మస్తాన్‌వలికి సహకరించినట్లు సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. అకాడమీలోని అకౌంట్ సెక్షన్‌లో కొంతమందిని ప్రశ్నిస్తున్నారు  పోలీసులు. యూనియన్, కెనరా బ్యాంక్‌లోని ప్రైవేట్ వ్యక్తులకు చెందిన రూ.9 కోట్ల ఎఫ్‌డీలను మస్తాన్‌వలి ముఠా డ్రా చేసినట్లు గుర్తించారు. అరెస్ట్ చేసిన నలుగురిని పది రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ సీసీఎస్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. సోమవారం ఈ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ జరపనుంది. 
 

click me!