
కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి. రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ జాప్యమే ఆత్మబలిదానాలకు కారణమని ఆమె ఆరోపించారు. రాజకీయంగా.. వున్న పార్టీని ఎవరేమైనా సమర్ధించాల్సినప్పటికీ వాస్తవాలను ఎక్కడైన కొంత అంగీకరించక తప్పదని విజయశాంతి వ్యాఖ్యానించారు. తెలంగాణ సాయుధ పోరాటం, సెప్టెంబర్ 17పై మాట్లాడే అర్హత బీజేపీకి లేదని వాదిస్తున్న పీసీసీకి తెలంగాణ అమరుల పేరుతో ఉద్యమాలకు వెళ్లే హక్కు కాంగ్రెస్‌కు కూడా వుండదని గుర్తించుకోవాలని ఆమె దుయ్యబట్టారు.