కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకురావడంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇంకా జీవోలు జారీ చేయలేదు. ఈ రెండు బోర్డుల పరిధిలో 16 ఔట్‌లెట్లకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. కానీ తెలంగాణ మాత్రం తమ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
హైదరాబాద్: ఇవాళ్టి నుండి Krishna, Godavari బొర్డుల పరిధిలోకి ప్రాజెక్టులు తీసుకు రావడంపై రెండు రాష్ట్రాలు ఎలాంటి వైఖరిని తీసుకొంటాయనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.Telangana, Andhra pradesh రాష్ట్రాల మధ్య చోటు చేసుకొన్న జల వివాదాలకు చెక్ పెట్టేందుకు ఈ ఏడాది జూలై 15న కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ Gazette నోటిఫికేషన్ ను జారీ చేసింది.
ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేకుండా ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకురావడంపై తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గెజిట్ నోటిఫికేషన్ అమలు విషయమై ఈ నెల 11,12 తేదీల్లో Grmb, Krmbలు సమావేశాలు నిర్వహించాయి.ఈ సమావేశాలకు రెండు రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల శాఖాధికారులు హాజరయ్యారు.
also read:కేఆర్ఎంబీ కీలక నిర్ణయం: ఈ నెల 14 నుండి గెజిట్ అమలు
కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సమావేశాల్లో తీసుకొన్న నిర్ణయాలకు సంబంధించిన మినిట్స్ ను ఈ రెండు బోర్డుల అధికారులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పంపారు. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల్లో మొత్తం 15 అవుట్‌లెట్లకు సంబంధించి రెండు రాష్ట్రాలు ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది.
తెలంగాణ జెన్‌కో పరిధిలోని మూడు జల విద్యుత్ కేంద్రాలను మినహా మిగిలిన వాటిని బోర్డులకు అప్పగించేందుకు కేసీఆర్ సర్కార్ సానుకూలంగా బోర్డు సమావేశాల్లో చెప్పినట్టుగా తెలుస్తోంది. మరో వైపు ఏపీ ప్రభుత్వం ఆరు ఔట్‌లెట్లను ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించినట్టుగా సమాచారం. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఈ మేరకు జీవోలు జారీ చేయాల్సి ఉంది. ఈ జీవోలు జారీ అయితేనే గెజిట్ నోటిఫికేషన్ అమలు ప్రక్రియకు మార్గం సుగమం కానుంది.
Srisailam ప్రాజెక్టు పరిధిలో ఏడు, Nagarjuna sagar ప్రాజెక్టు పరిధిలోని ఎనిమిది ఔట్‌లెట్లలో గెజిట్ అమలుకు కేఆర్ఎంబీ ప్రతిపాదించింది. గోదావరి నదిపై ఉన్న పెద్దవాగుపై గెజిట్ అమలుకు రెండు రాష్ట్రాలు సమ్మతించాయి.రెండు రాష్ట్రాలు ప్రాజెక్టులను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేస్తేనే వాటిని బోర్డులు తమ పరిధిలోకి తీసుకొనేందుకు కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీకి అధికారం రానుంది. గెజిట్ అమలు కోసం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఏ రకంగా సహకరిస్తున్నాయనే విషయమై రెండు బోర్డుల అధికారులు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు సమాచారం పంపారు..ఈ విషయమై కేంద్ర జల్‌శక్తిమంత్రిత్వశాఖ నిర్ణయం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే గెజిట్ నోటిఫికేషన్ అమలును వాయిదా వేయాలని తెలంగాణ సీఎం Kcr, తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్ లు కేంద్రాన్నికోరారు. ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ ఈ విషయమై కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తో ఈ విషయమై చర్చించారు. ఇటీవలనే కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు రజత్ కుమార్ లేఖ రాశారు.