హైద్రాబాద్‌లో సోదాలు: ఇద్దరిని ట్రాప్ చేసిన సీబీఐ

By narsimha lode  |  First Published Oct 25, 2021, 9:09 PM IST


హైద్రాబాద్ జీఎస్టీ కార్యాలయంలో ఇద్దరు అధికారులు లంచం తీసుకొంటుండగా సీబీఐ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొంది..జీఎస్టీ పెండింగ్ లో ఉన్న షాపుల వద్ద బిల్ మెయింటెన్ చేయని కంపెనీలలో  అక్రమాలకు పాల్పడ్డారని వీరిపై ఫిర్యాదులు అందాయి.



హైదారాబాద్: హైద్రాబాద్ నగరంలోని బషీర్ బాగ్ లో గల కస్టమ్స్  యాంటీ విస్సన్ వింగ్ లో పనిచేస్తున్న అధికారులు లంచం తీసుకొంటుండగా సోమవారం నాడు Cbiఅధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు.కస్టమ్స్  యాంటీ విస్సన్ వింగ్ లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ కిషన్ పాల్, సూపరిండెంట్ సురేష్ కుమార్‌లను సీబీఐ ట్రాప్ చేసింది.జీఎస్టీ పెండింగ్ లో ఉన్న షాపుల వద్ద బిల్ మెయింటెన్ చేయని కంపెనీలలో  అక్రమాలకు పాల్పడ్డారని వీరిపై ఫిర్యాదులు అందాయి. దీంతో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.ఇవాళ  Bribe తీసుకొంటుండగా వీరిని సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెండ్ గా పట్టుకొన్నారు.

also read:వచ్చే ఏడాది నుండి చెప్పులు, బట్టలు మరింత ఖరీదైనవి కావచ్చు: జి‌ఎస్‌టి కౌన్సిల్ నిర్ణయం

Latest Videos

undefined

గతంలో కూడా Gst విషయంలో కూడ కొందరు అధికారులు  వ్యాపారులను  ఇబ్బందులు పెట్టిన ఘటనల్లో కూడా సీబీఐ అధికారులు కొందరు అధికారులను  రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. జీఎస్టీ అమలైన తర్వాత వ్యాపారులు సక్రమంగా పన్నులు చెల్లించకుండా ఉన్న వారిపై కొందరు అధికారులు పన్నులు వసూలు కాకుండా ఉండేందుకు గాను అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.  దీంతో  ఈ విషయమై సీబీఐకి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఇవాళ సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.


 

click me!