
కరీంనగర్: హుజురాబాద్ నియోజకవర్గంలో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి హరీష్ రావు ఇల్లందకుంట దళితవాడలో కొద్దిసేపు ఆగి కాలనీ వాసులతో మాట్లాడారు. ఈ సందర్భంగా దళిత బందుపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని... ఈ పథకాన్ని గ్రౌండ్ చేయకపోతే తన పేరు మార్చుకుంటానని హరీష్ సవాల్ విసిరారు.
''dalit bandhu ను ప్రతి ఇంటికి ఇస్తాం. కావాలనే ఈ పథకంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేసాయి... అపోహలు కల్పించాయి. వీటిని ఎవరు నమ్మవద్దు. దళిత బంధు ను గ్రౌండ్ చేయకపోతే నా పేరే మార్చుకుంటాను'' అని harish rao స్పష్టం చేసారు.
''దళితబంధు పథకం చరిత్రలోనే కనీవినీ ఎరుగని గొప్ప పథకం. దళితులూ అడగకుండానే ఈ పథకాన్ని సిఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. దళితులు ఆర్థికంగా ఎదగాలన్నదే సిఎం సంకల్పం. KCR కు దళితుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం దళిత బంధు'' అన్నారు.
వీడియో
''గత ప్రభుత్వాల హయాంలో ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా దళితులకు రుణాలు ఇవ్వలేదు. uttar pradesh ముఖ్యమంత్రిగా పనిచేసిన Mayavathi కూడా ఇలాంటి పథకం అమలు చేయలేకపోయారు. కానీ కేసీఆర్ ధైర్యం చేసి ఈ గొప్ప పథకాన్ని ప్రారంభించారు'' అని పేర్కొన్నారు.
READ MORE Huzurabad Bypoll: ఈటలను చూసి అయ్యో అయ్యో అని జాలిపడకండి...: మంత్రి కొప్పుల ఈశ్వర్
''BJP వాళ్ళు ఈ పథకం రాదు అని హుజురాబాద్ లో అనుమానాలు వ్యక్తం చేసారు. అలాగే వేరే నియోజకవర్గాల ప్రజల వద్దకు వెళ్లి ఈ పథకం మీకు రాలేదు అంటూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసారు. కానీ వాళ్ళేమి ఇస్తారో మాత్రం చెప్పరు'' అని మండిపడ్డారు.
''దళితులూ ఆలోచించాలి. ఇది నడుమంత్రపు ఎలక్షన్. ఇంకా రెండేళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. సిఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి పథకాన్ని మొదట దళితులకే ఇచ్చారు. కానీ తదనంతరం అందరికి వర్తింపచేసారు. దళిత బంధు కూడా అంతే... భవిష్యత్తులో అందరికి అమలు చేస్తాం'' అన్నారు.
''ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించండి. ఆర్థిక మంత్రిగా అందరికి అండగా ఉండి, దగ్గరుండి పనులు చేయిస్తా.. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును మరింత జోష్ తో ముందుకు తీసుకుపోతాం'' అని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.