ఫోన్ ట్యాపింగ్‌పై అసత్య ఆరోపణలు: రేవంత్ రెడ్డికి డీజీపీ కౌంటర్

Published : Oct 25, 2021, 08:17 PM ISTUpdated : Oct 25, 2021, 09:18 PM IST
ఫోన్ ట్యాపింగ్‌పై అసత్య ఆరోపణలు: రేవంత్ రెడ్డికి డీజీపీ కౌంటర్

సారాంశం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై  డీజీపీ మహేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే వ్యవహరిస్తున్నామన్నారు.


హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ పై టీపీసీసీ చీఫ్ Revanth reddyy అసత్యప్రచారం చేస్తున్నారని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు.సోమవారం నాడు ఆయన  ఓ ప్రకటన  విడుదల చేశారు. .టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన పోణ్ ట్యాపింగ్ వ్యాఖ్యలపై తెలంగాణ డీజీపీ Mahender reddyకౌంటరిచ్చారు.

also read:డీజీపీ మహేందర్ రెడ్డి ఫోన్ ట్యాప్: రేవంత్ రెడ్డి సంచలనం

ఎవరి ఫోన్లను  ట్యాప్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలనే అమలు చేస్తున్నామన్నారు.శాంతి భద్రతలను కాపాడేందుకు  నిరంతరం ప్రయత్నం చేస్తున్నామని ఆయన వివరించారు.

పోలీస్ ఉన్నతాధికారుల మధ్య విబేధాలున్నాయనేది అవాస్తవమని ఆయన చెప్పారు. అన్ని విభాగాల మధ్య సమన్వయం ఉందన్నారు. ప్రతిభ, సామర్ధ్యం ఆధారంగానే పోలీస్ శాఖలో పోస్టింగులు ఇచ్చామన్నారు. పోలీసుల ఆత్మస్థైర్యం మనో ధైర్యం దెబ్బతింటుందని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.మావోయిస్టులు ఉంటే బాగుండేదని రేవంత్ అనడం సరైంది కాదన్నారు.మావోయిస్టుల ఏరివేతలో 500 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారన్నారు.

పోలీస్ శాఖలో గ్రూపులు లేవన్నారు.అసత్య ప్రచారాలతో మమ్మల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని డీజీపీ చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో విపక్ష నేతలతో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి ఫోన్లను కూడా  ట్యాపింగ్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

తెలంగాణ రాష్ట్రంలో విపక్ష నేతలతో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి ఫోన్లను కూడా  ట్యాపింగ్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రిటైరైన పోలీసు అధికారులు ప్రభాకర్‌రావుతోపాటు ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు, కోవర్ట్‌ ఆపరేషన్‌లో నిష్ణాతులు వేణుగోపాల్‌రావు, నర్సింగరావుకు కేసీఆర్ చట్ట విరుద్ధంగా రెగ్యులర్‌ పదవులు ఇచ్చారన్నారు. మొత్తం 30మందితో ఓ దళాన్ని  కేసీఆర్ ఏర్పాటు చేసుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. డీజీపీని అవమానిస్తూ తక్కువ హోదా కలిగిన అధికారితో నిఘా పెట్టారని అన్నారు. డీజీపీ కుటుంబం భయంభయంగా గడుపుతున్నదని పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్‌లో రాధాకిషన్‌రావు, సిట్‌లో సందీపరావు, ఏసీబీలో భుజంగరావు, మల్కాజిగిరి ఏసీపీ శ్యాంప్రసాదరావు, రమణకుమార్‌ను పెట్టి.. హైదరాబాద్‌ చుట్టుపక్కల భూములపై నిఘా పెట్టడంతోపాటు ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు
 


 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్