ప్రేమిస్తున్నానని నమ్మించి.. శారీరకంగా ఒక్కటయ్యాక మొహం చాటేసి.. సినీ హెయిర్ స్టైలిస్ట్ పై కేసు...

Published : Nov 29, 2022, 10:19 AM ISTUpdated : Dec 01, 2022, 06:30 PM IST
ప్రేమిస్తున్నానని నమ్మించి.. శారీరకంగా ఒక్కటయ్యాక మొహం చాటేసి.. సినీ హెయిర్ స్టైలిస్ట్ పై కేసు...

సారాంశం

ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకుని, పెళ్లి చేసుకోమన్నందుకు ఓ మహిళ మీద దాడికి దిగిన సినీ పరిశ్రమకు చెందిన ఓ హెయిర్ స్టైలిస్ట్ మీద కేసు నమోదయ్యింది. 

హైదరాబాద్ : సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి తెలిసిన విషయమే. అయితే పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసే కేసులు కూడా చాలానే వెలుగు చూస్తున్నాయి. అలా  సినీ పరిశ్రమకు చెందిన హెయిర్ స్టైలిస్ట్ పై.. ప్రేమ పేరుతో నమ్మించి.. శారీరకంగా వాడుకుని మోసం చేశాడని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు... బంజారా హిల్స్ రోడ్ నెంబర్14లోని నందినగర్ లో ఓ మహిళ నివాసముంటుంది. ఆమె కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేస్తుంది. 

ఈ క్రమంలోనే 2018లో ఆమెకు తమ ఇండస్ట్రీకే  చెందిన.. ఓ హెయిర్ స్టైలిస్ట్ తో పరిచయం ఏర్పడింది. అతని పేరు మన్మథరావు అలియాస్ మహేష్. ఇద్దరూ ఒకే ప్రొపెషన్ కావడంతో తరచూ మాట్లాడుకుంటుండేవారు. ఈ క్రమంలోనే మన్మథరావు ఆ మహిళను ప్రేమిస్తున్నానని చెప్పాడు. అయితే దీనికి ఆ మహిళ ఒప్పుకోలేదు.. తాను ఇప్పటికే ఒక రేప్ కేసులో బాధితురాలిగా ఉన్నానని చెప్పుకొచ్చింది. అందుకే ఇప్పుడే తానేం తేల్చుకోలేనని.. ఆలోచించుకోవడానికి తనకు కొద్ది రోజులు టైం కావాలని అడిగింది. 

దీనికి అతను సరే అన్నాడు. ఆ తరువాత ఒక షూటింగ్ సందర్భంగా వీరిద్దరూ నెల్లూరుకు వెళ్లారు. ఈ సమయంలో అనుకోకుండా ఇద్దరూ శారీరకంగా ఒకటయ్యారు. ఆ తరువాత అతను కనిపించడం లేదు. నిరుడు ఆగస్టులో తనను పెళ్లి చేసుకోవాలని ఆమె అడిగింది. అప్పటినుంచి మహేష్ ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టాడు.. ఆమెకు కనిపించడంలేదు.. ఆమె ఫోన్ నెంబర్ కూడా బ్లాక్ చేశాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం కృష్ణా నగర్ లో మన్మధరావు ఆమెకు కనిపించాడు. వెంటనే ఆమె మహేష్ ను పెళ్లి విషయమై ప్రశ్నించింది. దీంతో మహేష్ ఆమె మీద భౌతిక దాడికి దిగాడు. తీవ్రంగా కొట్టాడు. దీంతో బాధితురాలు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిమీద దర్యాప్తు చేపట్టారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గద్దార్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో CM Revanth Reddy Speech | Gaddar Awards | Asianet News Telugu
ఉగాది పంచాంగ శ్రవణం కేటీఆర్ జాతకం చెప్పిన పండితులు KTR Attend Ugadi Celebrations | Asianet Telugu