టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఊరట లభించింది. ఇవాళ విచారణకు రావొద్దని సిట్ సమాచారం పంపింది. ఈ మేరకు రఘురామకృష్ణంరాజుకు సిట్ అధికారులు మెయిల్ పంపారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును ఇవాళ విచారణకు రావొద్దని సిట్ అధికారులు సమాచారం పంపారు. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఈ నెల 24న సిట్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొంది. అయితే కొన్ని కారణాలతో ఇవాళ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును విచారణకు రావొద్దని సిట్ సమాచారం పంపింది. ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఈ మేరకు మెయిల్ ద్వారా సమాచారం పంపారు. ఏ రోజున విచారణకు రావాలని కోరితే అదే రోజున విచారణకు రావాలని సిట్ రఘురామకృష్ణంరాజును కోరింది. ఈ ఏడాది అక్టోబర్ 26న మొయినాబాద్ ఫాంహౌస్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాలకు గురి చేస్తున్నారని కేసు నమోదైంది. ఈ కేసులో రామచంద్రభారతి, సింహయాజీ,నందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు
ఈ కేసులో నిందితులతో ఎంపీ రఘురామకృష్ణంరాజు దిగిన ఫోటోలను సిట్ బృందం గుర్తించింది. దీంతో ఈ కేసులో రఘురామకృష్ణంరాజును విచారణకు పిలవాలని సిట్ నిర్ణయించింది. ఈ కేసులో విచారణకు రావాలని ఐదు రోజుల క్రితం నోటీసులు పంపింది.అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి , పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని ముగ్గురు నిందితులు ప్రయత్నించారని కేసు నమోదైంది.
ఈ కేసు విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది.ఈ కేసు విచారణలో సిట్ దూకుడుగా విచారణ సాగిస్తుంది. కేరళ, కర్ణాటక హార్యానా, ఏపీ రాష్ట్రాల్లో సిట్ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలక సమాచారాన్ని సేకరించింది. కేరళ రాష్ట్రానికి చెందిన తుషార్, జగ్గుస్వామిలకు నోటీసులు జారీ చేసింది. బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ కి కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై బీఎల్ సంతోష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సిట్ నోటీసులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. డిసెంబర్ 5వ తేదీ వరకు సిట్ నోటీసులపై స్టే విధిస్తున్నట్టుగా హైకోర్టు తెలిపింది.
ఇదిలా ఉంటే ఇదే కేసులో కేరళకు చెందిన తుషార్ కూడా నిన్న తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ కేసును సీబీఐ విచారించేలా ఆదేశించాలని కోరారు. సిట్ విచారణపై స్టేను కోరారు.సిట్ దర్యాప్తు రాజకీయ దురుద్దేశ్యంతో కూడుకున్నట్టుగా ఉందని కూడా ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. తనకు లుకౌట్ నోటీసులు జారీ చేయడం కూడ రాజకీయ దురుద్దేశ్యంతో కూడినదిగా తుషార్ ఆ పిటిషన్ లో చెప్పారు.
ALSO READ:టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: సీబీఐ విచారణ కోరుతూ తెలంగాణ హైకోర్టులో తుషార్ పిటిషన్
ఈ కేసులో అరెస్టైన నందకుమార్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. నందకుమార్ భార్య చిత్రలేఖను కూడా సిట్ విచారించింది. ఈ నెల 25, 27 తేదీల్లో చిత్రలేఖను సిట్ విచారించింది.మరో వైపు ఈ కేసులో విచారణకు రావాలని జగ్గుస్వామికి నోటీసులు జారీ చేసింది సిట్. జగ్గుస్వామిపై సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. తమ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో బీజేపీ హస్తం ఉందని టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది.ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చుతుంది. ఈ కేసుతో తమకు సంబంధం లేదని బీజేపీ నేతలు ప్రకటించారు.