హయత్‌నగర్ మండలంలోని తట్టిఅన్నారంలో టెన్త్ క్లాస్ విద్యార్ధినిపై సహచర విద్యార్ధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
హయత్‌నగర్: మండలంలోని తట్టి అన్నారంలో టెన్త్ క్లాస్ విద్యార్ధినిపై ఐదుగురు విద్యార్థులు సామూహిక అత్యాచారినికి పాల్పడ్డారు. ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితులపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
తట్టి అన్నారంలోని వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉండే టెన్త్ క్లాస్ విద్యార్ధినిపై సహచర విద్యార్ధులు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసే సమయంలో రికార్డు చేశారు.ఈ వీడియోలను తోటి విద్యార్ధులకు షేర్ చేశారు నిందితులు. ఈ విషయం బయటకు చెబితే రేప్ చేసిన దృశ్యాలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని నిందితులు బెదిరించి ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
టెన్త్ క్లాస్ విద్యార్ధినిపై నాలుగు నెలలుగా నిందితులు అత్యాచారానికి పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు. తొలుత ఓ విద్యార్ధి బాధితురాలి న్యూడ్ ఫోటోలు తీశాడు.ఈ ఫోటోలు చూపించి తొలుత ముగ్గురు విద్యార్ధులు అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ సమయంలో ఒకరు వీడియో తీశారు.ఈ వీడియోను 20 మంది విద్యార్ధులకు షేర్ చేశారు. ఈ వీడియోను చూపి పలువురు విద్యార్ధులు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు విచారణలో గుర్తించారు.ఈ ఏడాది ఆగస్టు మాసంలోనే విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అప్పటి నుండి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడుతున్నట్టుగా పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.
దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ మహిళలపై అత్యాచారాలు, దాడులవంటి ఘటనలపై కేసులు నమోదౌతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ తరహా నేరాల అదుపు చేసేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన మేరకు ఫలితాలు ఇవ్వడం లేదు.కఠినమైన చట్టాలను తీసుకురావడంతో పాటు వాటి అమలులో కూడా అదే చిత్తశుద్దిని చూపాల్సిన అవసరం ఉందని మహిళా సంఘాలు కోరుతున్నాయి.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఫరూఖ్ బాద్ జిల్లాలోని ఫతేఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై ఇద్దరు యువకులు 2021 జనవరి 8న అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఇద్దరిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితులకు ఈ ఏడాది ఆగస్టు మాసంలో బెయిల్ లభించింది. తమలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని నిందితులు బాధితురాలిపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది.
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి ప్రేమకు నిరాకరించిందనికిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు.ఈ పెళ్లిపై యువతి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో బాధితురాలిపై యువకుడు అతని స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఘటన ఈ నెల 21న జరిగింది.
ఈ నెల 19న ఢిల్లీలోని మదన్ పూర్ ప్రాంతంలో ప్రియురాలిని ప్రియుడు అత్యంత దారుణంగా హత్య చేశారు.ప్రియురాలిపై అనుమానంతో ప్రియుడు చంపేశాడు. మరొకరితో ప్రియురాలికి సంబంధం ఉందనే అనుమానంతో నిందితుడు ఆమెను చంపాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణ జిల్లాలో అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు నిందితులు. ఈ నెల 10, 11 తేదీల్లో నిందితులను బాధితులను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు.