నిజామాబాద్‌లో 70 కుక్కలకు విషమిచ్చి చంపేశారు.. సర్పంచ్ పై కేసు

By Mahesh K  |  First Published Feb 20, 2024, 5:15 PM IST

నిజామాబాద్‌లో సుమారు 70 కుక్కలకు విషం ఇచ్చి చంపేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. యానిమల్ యాక్టివిస్టులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో సర్పంచ్ పై కేసు నమోదైంది.
 


Stray Dogs: ఇటీవలి కాలంలో వీధి కుక్కల వీరంగం తరచూ వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. చాలా చోట్ల కుక్కలపై ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్‌లో ఏకంగా 70 కుక్కలకు విషమిచ్చి చంపేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలియగానే కొందరు యానిమల్ యాక్టివిస్టులు సర్పంచ్ పై ఫిర్యాదు ఇచ్చి కేసు నమోదు చేయించారు. 

నిజామాబాద్ జిల్లా మాచర్లలో సుమారు 70 కుక్కలు మృత్యువాత పడి కనిపించాయి. వాటికి విషం ఇంజెక్ట్ చేసి చంపేసినట్టు తెలియవచ్చింది. ఈ విషయాన్ని యాక్టివిస్టులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. 

Latest Videos

Also Read: Mangalagiri: ఆర్కే డ్రామాలు.. అందుకే షర్మిల దగ్గరికి వెళ్లి వచ్చారు: మాజీ మంత్రి జవహర్

యానిమల్ యాక్టివిస్టు సాయి శ్రీ అందించిన ఫిర్యాదు ప్రకారం, ‘మాచర్ల గ్రామంలో జంతువులపై దారుణ ఘటన జరిగింది. ఫిబ్రవరి 15, 16వ తేదీల్లో నాకు కొంత సమాచారం అందింది. సుమారు 70 కుక్కలను మాచర్ల గ్రామంలో దారుణంగా చంపేశారని తెలిసింది. సర్పంచ్, కార్యదర్శి మరికొందరు కలిసి ఈ దారుణానికి పాల్పడినట్టు చెప్పారు. ఓ కాల్‌లో సర్పంచ్ కూడా వాటిని చంపేసినట్టు అంగీకరించారు. వీధి కుక్కలకు విషం ఇంజెక్షన్ ఇచ్చి చంపేయించడానికి కొందరిని పురమాయించినట్టు తెలిసింది’ అని వివరించారు.

click me!