రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల నుండి విజయ సంకల్ప యాత్రలను బీజేపీ ప్రారంభించింది.
హైదరాబాద్: రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో మంగళవారంనాడు విజయ సంకల్ప యాత్రలను బీజేపీ ప్రారంభించింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కృష్ణా విజయ సంకల్ప యాత్రను కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రెండు ఒక్కటేనన్నారు. ప్రపంచమంతా బీజేపీ వైపు చూస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రెండు కుటుంబ పార్టీలేనని ఆయన విమర్శించారు. ప్రపంచం మొత్తం మోడీ వైపు చూస్తుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు.
తాండూరులో మరో యాత్రను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రారంభించారు. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుపై సాగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు అన్నవారిని చెప్పుతో కొట్టాలని బండి సంజయ్ చెప్పారు. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు.
undefined
also read:అభివృద్దిలో దేశం దూసుకెళ్తుంది:జమ్మూలో పలు ప్రాజెక్టులు ప్రారంభించిన మోడీ
రాష్ట్రాన్ని ఐదు క్లస్టర్లుగా విభజించి ఐదు ప్రాంతాల నుండి విజయ సంకల్ప యాత్రలను బీజేపీ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఇవాళ నాలుగు ప్రాంతాల నుండి యాత్రలను ప్రారంభించింది. ఐదు యాత్రలు రాష్ట్రంలోని 5,500 కి.మీ. పాటు యాత్రలు సాగనున్నాయి. నిర్మల్ జిల్లాలో ఈ యాత్రను అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ప్రారంభించారు. భాగ్యలక్ష్మి యాత్రను గోవా సీఎం ప్రమోద్ సావంత్ భువనగిరిలో ప్రారంభించారు..
మేడారం జాతర నేపథ్యంలో ఒక యాత్రను మరో రెండు రోజుల తర్వాత ప్రారంభించనున్నారు. మార్చి 5వ తేదీ నాటికి ఈ యాత్రలు ముగించనున్నారు. ముగింపు సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించనున్నారు.
also read:జయలలిత 27 కిలోల బంగారం వేలం: ఎందుకో తెలుసా?
రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 114 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా ఈ యాత్రలు సాగేలా ఏర్పాట్లు చేశారు.102 రోడ్‌షోలు, 79 ఈవెంట్స్,180 రిసెప్షన్స్ నిర్వహించేలా ప్రణాళికలు చేసింది భారతీయ జనతా పార్టీ.
also read:చేతిలో చిల్లిగవ్వ లేదు, టీ కోసం డబ్బు సంపాదించారు: నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో
ఈ నెల 24వ తేదీన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విజయ సంకల్ప యాత్రలో పాల్గొంటారు.పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఈ యాత్రలను పూర్తి చేయాలని బీజేపీ ప్లాన్ చేసింది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలనే లక్ష్యంతో ఈ యాత్రలను ఆ పార్టీ చేపట్టింది.
తెలంగాణపై బీజేపీ కేంద్ర నాయకత్వం కూడ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించడం కోసం కమల దళం వ్యూహలు రచిస్తుంది.