తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం: రెండు కాంగ్రెస్‌కు, ఒకటి బీఆర్ఎస్‌కు

Published : Feb 20, 2024, 04:18 PM IST
 తెలంగాణలో మూడు  రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం: రెండు కాంగ్రెస్‌కు, ఒకటి బీఆర్ఎస్‌కు

సారాంశం

తెలంగాణలో ముగ్గురు అభ్యర్ధులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇద్దరు కాంగ్రెస్, ఒక్క స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్ధి గెలుపొందారు.

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రం నుండి ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మంగళవారంనాడు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.  కాంగ్రెస్ పార్టీ రెండు, బీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని కైవసం చేసుకుంది.  

తెలంగాణ రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో  ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది ఈసీ.  బడుగుల లింగయ్య యాదవ్,  వద్దిరాజు రవిచంద్ర,  జోగినపల్లి సంతోష్ కుమార్ లు  రిటైర్ కానున్నారు. దీంతో  రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.

also read:జయలలిత 27 కిలోల బంగారం వేలం: ఎందుకో తెలుసా?

మొత్తం  ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు నామినేషన్లను  సాంకేతిక కారణాలతో  తిరస్కరించారు. బీఆర్ఎస్ తరపున వద్దిరాజు రవిచంద్ర,  కాంగ్రెస్ తరపున రేణుకా చౌదరి , అనిల్ కుమార్ యాదవ్ లు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన పూర్తైంది.  ఇవాళ నామినేషన్ల ఉపసంహరణకు గడువు. ఈ గడువు కూడ పూర్తైంది. దరిమిలా  ఈ ముగ్గురు అభ్యర్థులు  విజయం సాధించినట్టుగా  రిటర్నింగ్ అధికారి  ప్రకటించారు. 

also read:ముగిసిన రాజ్యసభ నామినేషన్ల గడువు: తెలంగాణలో మూడు స్థానాలు ఏకగ్రీవం, ప్రకటనే తరువాయి

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఉన్నబలం ఆధారంగా  ఈ మూడు స్థానాలు దక్కాయి. ఇటీవలనే  రెండు ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వేర్వేరుగా ఈ రెండు స్థానాలకు నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీంతో  ఈ రెండు స్థానాలు  కాంగ్రెస్ కు దక్కాయి. 

also read:చేతిలో చిల్లిగవ్వ లేదు, టీ కోసం డబ్బు సంపాదించారు: నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో

మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ  మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.  వైఎస్ఆర్‌సీపీ ఈ మూడు స్థానాల్లో విజయం సాధించింది. గొల్ల బాబురావు,  వై.వీ . సుబ్బారెడ్డి,  మేడా రఘునాథ్ రెడ్డిలు రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  ఈ ఎన్నికలకు తెలుగు దేశం పార్టీ దూరంగా ఉంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !