హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై ఎంఐఎం కార్పోరేటర్ మూర్తుజ అలీ, అతని అనుచరులు రెచ్చిపోయారు.
లాక్‌డౌన్‌ను ప్రజలు ఖచ్చితంగా అమలు చేయడానికి పోలీసులు చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు పోలీసులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
Also Read:ఈ రోజు ఆరు కేసులే, దాచేస్తే దాగేవి కావు: ప్రతిపక్షాలపై ఈటెల ధ్వజం
undefined
ప్రాణాలు పణంగా పెట్టి వీరు చేస్తున్న సేవలను మెచ్చుకోకపోగా, కొందరు అసభ్య పదజాలంలో దూషిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై ఎంఐఎం కార్పోరేటర్ మూర్తుజ అలీ, అతని అనుచరులు రెచ్చిపోయారు.
వివరాల్లోకి వెళితే... మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చావని ప్రాంతంలో శుక్రవారం ఇద్దరు కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వారి విధులకు ఆటంకం కలిగించిన ఎంఐఎం కార్పోరేటర్ మూర్తుజ అలీ.. హిందూ దేవాలయాల వద్ద వెళ్లి డ్యూటీ చేసుకోండి అంటూ మతం రంగు పులుముతూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
Also Read:లాక్ డౌన్ ఎఫెక్ట్: తెలంగాణ గుళ్ళలో ఆన్ లైన్లో పూజ, ఎస్ఎంఎస్ ద్వారా ఆశీర్వాదం!
అంతేకాకుండా మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తానంటూ పోలీసులను అలీ బెదిరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో ఆ మూర్తుజ అలీ అతని అనుచరులపై కేసు నమోదు చేశారు.