పాతబస్తీలో బాలికపై అత్యాచారం.. పోలీసుల అదుపులో ఇద్దరు, రిమాండ్‌కు తరలింపు

By Siva KodatiFirst Published Sep 15, 2022, 9:06 PM IST
Highlights

పాతబస్తీ బాలిక అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని సయ్యద్ నైమత్ అహ్మద్, సయ్యద్ రవిష్ అహ్మద్ మెహదీగా గుర్తించామని, వీరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ వెల్లడించారు. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాతబస్తీ బాలిక అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మీర్‌చౌక్ ఏసీపీ స్పష్టం చేశారు. బాలికను కిడ్నాప్ చేసి లాడ్జికి తీసుకెళ్లారని .. ఆపై ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారని ఏసీపీ పేర్కొన్నారు. నిందితులను సయ్యద్ నైమత్ అహ్మద్, సయ్యద్ రవిష్ అహ్మద్ మెహదీగా గుర్తించామని, వీరిద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ వెల్లడించారు. 

ALso Read:హైద్రాబాద్ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్: పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు

కాగా.. ఈ నెల 12వ తేదీన పాతబస్తీకి చెందిన బాలికను కారులో కిడ్నాప్ చేసిన నిందితులు నాంపల్లిలోని లాడ్జీలో ఉంచి అత్యాచారానికి పాల్పడ్డారు. తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధితురాలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో పాటు మంచినీటిలో టాబ్లెట్లు ఇచ్చారని బాధితురాలు తెలిపింది. బాధితురాలు చెప్పిన సమాచారం ఆధారంగా పోలీసులు ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే బాధితురాలికి పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుండి ఆమెను భరోసా సెంటర్ కు తరలించారు. ఈ ఘటనలో పాల్గొన్న మరో వ్యక్తి  కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు కూడా గంజాయి, మత్తు ఇంజక్లన్ల అమ్మకాల్లో కీలక సూత్రధారులని అధికారులు చెబుతున్నారు. 
 

click me!