భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన ఉచిత గుర్తుల జాబితాలో మళ్లీ కారును పోలిన గుర్తులు ఉన్నాయి. దీంతో బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో మండిపడుతోంది.
హైదరాబాద్ : ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)ని 'కారు'ను పోలిన ఎన్నికల గుర్తులు మళ్లీ వెంటాడుతున్నాయి. ఇటువంటి ఉచిత చిహ్నాలపై బీఆర్ఎస్ పదేపదే అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ఇటీవల భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) విడుదల చేసిన జాబితాలో అదే మళ్లీ అదే చోటు చేసుకుంది.
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు మే 15న ఈసీ విడుదల చేసిన 193 ఉచిత చిహ్నాలలో ‘రోడ్ రోలర్’, ‘చపాతీ రోలర్’, ‘డోలీ’, ‘కుట్టు మిషన్’, 'సోప్ డిష్', 'టెలివిజన్', 'కెమెరా', 'షిప్' లు మళ్లీ ఉన్నాయి. ఈ గుర్తులపై బిఆర్‌ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఉచిత చిహ్నాలు ఓటర్లలో గందరగోళాన్ని సృష్టించవచ్చని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని స్థానాల్లో పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తాయని బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
undefined
ముగ్గురు పిల్లల తల్లితో పెళ్లికి పేరెంట్స్ ఒప్పుకోలేదని... మనస్థాపంతో యువకుడు సూసైడ్
"మా పార్టీ ఎన్నికల గుర్తు అయిన.. 'కారు'ను పోలిన గుర్తులా.. కారులా కనిపించే ఉచిత చిహ్నాల జాబితాను ఎన్నికల సంఘం ఇవ్వడం మీద మాకు తీవ్ర అభ్యంతరాలున్నాయి. దీనిమీద మా పార్టీ త్వరలో ఈసీఐకి తాజా అభ్యంతరాలను దాఖలు చేస్తాం. అలాగే కొన్ని గుర్తులు గత ఎన్నికలలో మా పార్టీ అవకాశాలను ఎలా దెబ్బతీశాయో కూడా పార్టీ వివరిస్తుంది" అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సోమ భరత్ కుమార్ చెప్పారు.
గతంలో కూడా బిఆర్‌ఎస్ తరపున ఉచిత చిహ్నాలపై సోమ భారత్ ఇసిఐకి అభ్యంతరాలు దాఖలు చేశారు. 2011 నవంబర్‌లో ఈసీఐ ఉచిత చిహ్నాల జాబితా నుండి ‘రోడ్ రోలర్’ని తొలగించిందని, అయితే పార్టీ అభ్యంతరాలు ఉన్నప్పటికీ కమిషన్ దానిని మళ్లీ జాబితాలో చేర్చిందని బీఆర్ఎస్ మాజీ ఎంపీ, తెలంగాణ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ బి వినోద్ కుమార్ తెలిపారు.
2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బిఆర్‌ఎస్ (అప్పటి టిఆర్‌ఎస్) ఓట్లు, సీట్లు ఖరీదు చేసే ఇలాంటి ఉచిత చిహ్నాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన తరువాత, ఈసీఏ జాబితా నుండి 'ట్రక్', 'ఆటో రిక్షా', 'టోపీ','ఐరన్ బాక్స్'లను తొలగించింది. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా, గులాబీ పార్టీ 'రోడ్ రోలర్', 'చపాతీ రోలర్'.. లాంటి ఇతర ఎనిమిది గుర్తులను తొలగించాలని ఎన్నికల అధికారులను మళ్లీ సంప్రదించింది, అయితే ఎటువంటి మార్పుకు కమిషన్ అంగీకరించలేదు.
ఈవీఎంలపై చిన్న సైజు చిహ్నాలు, పోలింగ్ బూత్‌లలో వెలుతురు సరిగా లేకపోవడంతో ఓటర్లు అలాంటి చిహ్నాలను బీఆర్‌ఎస్ 'కారు'గా తప్పుగా భావిస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకుడు తెలిపారు. “వేలాది బిఆర్‌ఎస్ ఓట్లు ‘కారు’ను పోలిన గుర్తులతో స్వతంత్ర అభ్యర్థులకు మళ్లించే అవకాశం ఉంది. వారికి స్పష్టంగా మా రాజకీయ ప్రత్యర్థులు మద్దతు ఇస్తున్నారు' అని సోమ భారత్ అన్నారు.