కాళ్లలో నొప్పి వేస్తోందని, నడవలేకపోతున్నానని ఓ వ్యక్తి అంబులెన్స్ (108_ ambulance) కు కాల్ చేశాడు. దీంతో అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. అయితే అతడి ఆరోగ్యం బాగానే ఉందని, కేవలం లిఫ్ట్ కోసమే కాల్ చేశాడని సిబ్బందికి అర్థం అయ్యింది. అంబులెన్స్ సిబ్బంది, అతడికి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ (video viral)అవుతోంది.
ఆయన ఓ దినసరి కూలి. ఎందుకో తెలియదు గానీ తన హైదరాబాద్ నుంచి జనగామకు కాలినడకన వెళ్లాలని భావించాడు. భువనగిరికి చేరుకోగానే అలసిపోయాడు. కాళ్లు నొప్పి వేయడంతో లిఫ్ట్ కోసం ఏకంగా అంబులెన్స్ కు కాల్ చేశాడు. దీంతో అక్కడికి వచ్చిన అంబులెన్స్ సిబ్బంది అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బడ్జెట్ లో దక్షిణాదికి అన్యాయం.. అందుకే ప్రత్యేక దేశం అవసరం - కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలు వివాదాస్పదం
హైదరాబాద్ లో దినసరి కూలీగా పనిచేస్తున్న కె.రమేష్ అనే వ్యక్తి జనగామలోని తన అత్తగారింటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే 40 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆయన భువనగిరికి చేరుకున్నారు. కాళ్లు నొప్పి వేయడంతో ఫ్రీగా అత్తగారింటికి వెళ్లాలనే ఉద్దేశంతో అంబులెన్స్ కాల్ చేశారు. ఏదో ఎమర్జెన్సీ ఉందని భావించిన అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.
ఫుల్లుగా తాగి ఇంటిదగ్గర దింపమని అంబులెన్స్‌కు కాల్ చేసి వ్యక్తి
రమేష్ అనే వ్యక్తి ఫుల్లుగా తాగేసి భువనగిరి నుండి జనగాంకు నడుచుకుంటూ వెళ్తూ అంబులెన్స్‌కు కాల్ చేసాడు.. అవాక్కైన సిబ్బంది ఎందుకు కాల్ చేసావని అడగగా నడవలేకపోతున్నా, బస్సులు కూడా లేవు, నన్ను జనగాంలో దింపండి లేదంటే… pic.twitter.com/DOKtFYbbP3
అయితే రమేష్ అప్పటికే తాగేసి ఉన్నాడని సిబ్బంది గుర్తించారు. తాను నడవలేకపోతున్నానని, ఎప్పుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతానో తెలియదని చెప్పారు. తనకు జనగామ వరకు లిఫ్ట్ ఇవ్వాలని కోరాడు. ఇది కూడా అత్యవసరమే అని చెప్పారు. జనగామలో తాను వెళ్లాలనుకున్న ప్రాంతానికి బస్సు సౌకర్యం లేదని తెలిపారు.
‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ ఇదో నినాదమే కాదు.. పాలనా భావజాలం - రాజీవ్ చంద్రశేఖర్
అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించడానికే అంబులెన్స్ ను ఉపయోగించాలని సిబ్బంది ఆయనకు వివరించారు. కానీ రమేష్ వారిని సులభంగా వదలలేదు. తాను తీవ్రమైన కాళ్ల నొప్పులతో బాధపడుతున్నానని, అంబులెన్స్ లో జనగామకు తరలించాలని కోరారు. అయితే దానిని సిబ్బంది తిరస్కరించారు. కాళ్ల నొప్పులు వస్తే భువనగిరి ఏరియా హాస్పిటల్ కు తీసుకెళ్తామని చెప్పారు.
పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు - నిర్మలా సీతారామన్
కానీ.. ఆ ప్రతిపాదనను అతడు తిరస్కరించారు. తన చేతిలో రాడ్ ఉందని, అలసటతో పాటు నొప్పిగా ఉందని వేడుకుంటూ తనను జనగామలో దింపాలని పట్టుబట్టారు. అయితే అంబులెన్స్ సిబ్బంది అతడికి నచ్చజెప్పారు. అలసిపోతే కాసేపు విశ్రాంతి తీసుకుని పాదయాత్ర కొనసాగించాలని లేకపోతే జనగామకు బస్సు వెళ్లాలని సూచించారు.