Barrelakka: యూట్యూబర్ పై బర్రెలక్క తీవ్ర ఆగ్రహం.. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే?

By Mahesh K  |  First Published Feb 1, 2024, 4:02 PM IST

ఓ యూట్యూబర్‌పై బర్రెలక్క తీవ్రంగా ఆగ్రహించింది. ఎన్నికల సమయంలో తన తండ్రి వద్దకు వెళ్లి తనను డిఫేమ్ చేశాడని ఆమె శివాలెత్తింది. 
 


Barrelakka: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క తరుచూ వార్తల్లో ఉంటున్నారు. నిన్నా మొన్నటి వరకు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌తో పెళ్లి అనే ఓ తప్పుడు వార్తపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తాజాగా, మరోసారి ఆమె వార్తల్లోకి ఎక్కారు. ఇప్పుడు ఓ యూట్యూబర్ పై ఆమె శివాలెత్తుతున్న వీడియో వైరల్ అవుతున్నది.

ఎన్నికల సమయంలో తన గురించి ఆ యూట్యూబర్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశాడని, తన తండ్రికి డబ్బులు ఇచ్చి వీడియో తీసి తనను డిఫేమ్ చేశాడని బర్రెలక్క ఆ వీడియోలో ఆగ్రహంతో మాట్లాడింది. అలా చేయడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో తనకు దెబ్బ పడిందని పేర్కొంది. ఆ యూట్యూబర్ పై తాను పోలీసులకు ఫిర్యాదు ఇవ్వొచ్చని, కానీ, ఏ మీడియా ముందు తన పరువు తీశాడో.. అదే మీడియా ముందుకు నిజం రావాలని తెలిపింది. ఆ యూట్యూబర్ తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని డిమాండ్ చేసింది. ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నానని చెబితే ఆయన తల్లిదండ్రులు ఏమంటారు? అని పేర్కొంది.

Emo kastam vachindi Barrelakka Ki.. Solve Chesi SM Ppl Attention Laagandi CM Saab pic.twitter.com/RSpZbfCMiW

— PawanKalyan Devotee (@SidduOfficial)

Latest Videos

కాగా, యూట్యూబర్ మాత్రం తాను ఆమెను డిఫేమ్ చేయలేదని వాదించాడు. ఆ వీడియో కోసం తాను ఆమె తండ్రి వద్దకు వెళ్లలేదని, తనకు ఆ వీడియోకు సంబంధం లేదని డిఫెన్స్ చేసుకున్నాడు. కానీ, బర్రెలక్క రెచ్చిపోవడంతో ఆయన మిన్నకుండిపోయాడు.

ఎన్నికల సమయంలో తన తండ్రితో వీడియో తీయించి తన ఓట్లు తగ్గేలా చేసాడని ఒక యూట్యూబ్ ఛానల్లో రెచ్చిపోయిన బర్రెలక్క. pic.twitter.com/2FhTsWeauP

— Actual India (@ActualIndia)

Also Read: Budget2024: ఏపీ, తెలంగాణకు గణనీయంగా రైల్వే బడ్జెట్ కేటాయింపులు: కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కొందరు ఆమెకు మద్దతుగా కామెంట్లు చేయగా.. మరికొందరు మాత్రం ఆమె ఇప్పుడే లోక్ సభ ఎన్నికల కోసం ప్రిపేర్ అవుతున్నదని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. ఈ రాజకీయాలు, పదవులను ఆశించవొద్దని, సాధారణ జీవితాన్ని ఎంచుకోవాలని సూచనలు చేశారు.

click me!