హైద్రాబాద్‌లో కరోనా కేసు: అత్యవసరంగా కేబినెట్ సబ్ కమిటీ భేటీ

By narsimha lodeFirst Published Mar 3, 2020, 11:21 AM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో తొలి కరోనా కేసు  నేపథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ మంగళవారం నాడు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో సమావేశమైంది.


హైదరాబాద్: విదేశాల నుండి  తిరిగి వచ్చిన సికింద్రాబాద్‌కు చెందిన టెక్కీకి కరోనా వైరస్ పాజిటివ్ రిపోర్టు రావడంతో కేబినెట్ సబ్ కమిటీ మంగళవారం నాడు అత్యవసరంగా  సమావేశమైంది.

మంగళవారం నాడు ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ కార్యాలయంలో  కేబినెట్ సబ్ కమిటీ అత్యవసరం గా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబల్లి దయాకర్ రావు, ఈటల రాజేందర్ హాజరయ్యారు. మంత్రులతో  పాటు  మూడు శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు.  కరోనా వ్యాప్తి  చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై  ఈ సమావేశంలో చర్చించారు.

also read:హైదరాబాద్‌లో కరోనా.. ఎవరూ భయపడొద్దు: మంత్రి ఈటల

తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలతో టెక్కీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తరుణంలో వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడంపై చర్చిస్తున్నారు.  పురపాలక శాఖకు చెందిన ముఖ్య అధికారులు కూడ ఈ సమావేశానికి హాజరయ్యారు. పట్టణాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే విషయమై ప్రధానంగా చర్చిస్తున్నారు.

నగరంలో వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు కేబినెట్ సబ్ కమిటీ చర్చించనుంది. ఆయా ప్రధాన ఆసుపత్రుల్లో  వైద్య సౌకర్యాలకు సంబంధించి కూడ సబ్ కమిటీ చర్చించనుంది. 

కరోనా పాజిటివ్  టెక్కీ 80 మందిని కలిసినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ 80 మందిని గుర్తించి వారికి వ్యాధి లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయమై కూడ చర్చించనున్నారు.

click me!