కామారెడ్డిలో కాల్పుల కలకలం: గాల్లోకి కాల్పులు జరిపిన మాజీ మావోయిస్టు

Published : Mar 03, 2020, 10:58 AM IST
కామారెడ్డిలో కాల్పుల కలకలం: గాల్లోకి కాల్పులు జరిపిన మాజీ మావోయిస్టు

సారాంశం

కామారెడ్డి జిల్లాలో  మాజీ మావోయిస్టు శిలా సాగర్  మంగళవారం నాడు ఉదయం తన ఆయుధంతో కాల్పులకు దిగాడు. 

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పోసానిపేట మండలం పోసానిపేట వద్ద మంగళవారం నాడు మాజీ మావోయిస్టు  శిలాసాగర్ గాల్లోకి కాల్పులు. జరిపాడు. కుటుంబ కలహల నేపథ్యంలోనే శిలాసాగర్  కాల్పులకు జరిపినట్టుగా పోలీసులు గుర్తించారు.

కుటుంబసభ్యుల మధ్య గొడవలతో  శిలాసాగర్  కుటుంబసభ్యులను బెదిరించడానికి  తన వద్ద ఉన్న తుపాకీతో గాల్లోకి కాల్పులకు దిగాడు. ఈ కాల్పులతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. 

ఈ విషయంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు  కేసు నమోదు చేసుకొన్నారు. ఆయుధ లైసెన్స్‌ను దుర్వినియోగం చేశారని  శిలాసాగర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!