నిజామాబాద్ లో వృద్ధులైన అక్కాచెల్లెళ్లను దారుణంగా హత్య చేశారు దుండగులు. ఆ తరువాత వారిద్దరికీ నిప్పుపెట్టి అక్కడినుంచి పరారయ్యారు.
నిజామాబాద్ : తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. వృద్దులైన ఇద్దరు అక్కాచెల్లెళ్లను దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. అర్ధరాత్రి పూట ఇంట్లోకి ప్రవేశించి తలలపై కొట్టి హత్య చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
నిజామాబాదులోని ఆర్మూర్లోని జిరాయత్ నగర్ లో అక్కాచెల్లెళ్లు మగ్గిడి రాజవ్వ (72), గంగవ్వ (62) గత కొంతకాలంగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి వారి ఇంట్లోకి కొందరు గుర్తు తెలియని దుండగులు ప్రవేశించారు. ఇద్దరి తలల మీద బరువైన వస్తువులతో కొట్టి చంపారు.
ఆ తరువాత ఇద్దరి మృతదేహాలకు నిప్పు పెట్టారు. అక్కడినుంచి పారిపోయారు. అర్థరాత్రి జరగడంతో ఎవ్వరూ గమనించలేదు. ఉదయం ఇరుగు, పొరుగు అక్కాచెల్లెళ్ల ఇంట్లోనుంచి పొగ రావడం గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారం మేరకు ఏసీపీ ప్రభాకర్ రావు, సీఐ సురేష్ ఘటనాస్థలానికి చేరుకున్నారు.
సీనియర్లంతా బస్సు యాత్ర నిర్వహించాలి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
అక్కడ పరిశీలించిన తరువాత కేసు నమోదు చేసుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో ఆధారాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిమీద దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
ఇదిలా ఉండగా, కర్నాటకలోని బెంగళూరులో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. 27 ఏళ్ల యువకుడు తన వృద్ధ తల్లిదండ్రులను నరికి చంపాడు. ఆ తరువాత ఇంటికి బయటి నుంచి తాళం వేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ మేరకు పోలీసులు మంగళవారం తెలిపారు.
సోమవారం రాత్రి 8:30 నుంచి 9 గంటల మధ్య హత్యలు జరిగి ఉండవచ్చని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్ ఈస్ట్ బెంగళూరు) బీఎం లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. కొడుకు మీద హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బెంగళూరులోని కొడిగేహళ్లిలో సోమవారం రాత్రి తల్లిదండ్రులు భాస్కర్ (61), శాంత (60)లను హత్య చేసిన నిందితుడు శరత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కొడుకు దాడి సమయంలో సెక్సాజనేరియన్ జంట సహాయం కోసం అరిచినట్లు తెలుస్తోంది. అయితే అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు ఇది సాధారణ గొడవగా భావించారు. దీంతో పట్టించుకోలేదు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శరత్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. అతని అన్నయ్య సాజిత్ సమీపంలోని తిండ్లులో ఉంటాడు. మంగళవారం రోజు సాజిత్ తల్లిదండ్రులకు ఫోన్ చేసినా స్పందించలేదు. వెంటనే ఇంటికి వెళ్లి చూడగా ఇంటికి బయట నుంచి తాళం వేసి ఉండటాన్ని గుర్తించారు.
సాజిత్ తలుపులు బద్దలు కొట్టి చూడగా అతని తల్లిదండ్రులు రక్తపు మడుగులో పడి ఉన్నారు. అలా విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. శాంత పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగి అని, భాస్కర్ ప్రభుత్వ కార్యాలయ సముదాయం ఖనిజా భవన్‌లోని క్యాంటీన్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.
దక్షిణ కన్నడ జిల్లాలోని ఉల్లాల్‌కు చెందిన ఈ కుటుంబం, పిల్లలతో కలిసి 12 సంవత్సరాల క్రితం బెంగళూరుకు వచ్చిందని, శరత్, అతని తల్లిదండ్రుల మధ్య తరచుగా గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు.