లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్.. జనవరి 3 నుంచి సన్నాహక సమావేశాలు, కేటీఆర్ మార్గనిర్దేశంలో

By Siva Kodati  |  First Published Dec 29, 2023, 9:49 PM IST

లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్. వచ్చే నెల 3వ తేదీ నుంచి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలను పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా నిర్వహించాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో ఈ సమావేశాలు జరగనున్నాయి.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేతలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అధికార కాంగ్రెస్‌ నిర్ణయాలపై విమర్శలు చేస్తూనే .. లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్. నిర్ణీత సమయం కంటే ముందే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం వుండటంతో కేడర్‌ను సిద్ధం చేసే పనిలో పడింది. వచ్చే నెల 3వ తేదీ నుంచి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలను పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా నిర్వహించాలని నిర్ణయించింది. 

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పులు మళ్లీ జరగకుండా చూసేందుకు కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. ఈ మేరకు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాల షెడ్యూల్‌ను బీఆర్ఎస్ పార్టీ శుక్రవారం ప్రకటించింది. 

Latest Videos

బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాల షెడ్యూల్ :

జనవరి 3న ఆదిలాబాద్
జనవరి 4న కరీంనగర్
జనవరి 5న చేవెళ్ల
జనవరి 6న పెద్దపల్లి
జనవరి 7న నిజామాబాద్
జనవరి 8న జహీరాబాద్
జనవరి 9న ఖమ్మం
జనవరి 10న వరంగల్
జనవరి 16న నల్గొండ
జనవరి 17న నాగర్ కర్నూల్
జనవరి 18న మహబూబ్ నగర్
జనవరి 19న మెదక్
జనవరి 20న మల్కాజ్‌గిరి
జనవరి 21న సికింద్రాబాద్

click me!