Hyderabad: ఇకపై డ్రగ్ టెస్టులు కూడా.. టెస్టు కిట్‌లతో పోలీసులు.. ఈ కిట్‌లు ఎలా పని చేస్తాయి?

By Mahesh K  |  First Published Dec 29, 2023, 8:50 PM IST

ఈ న్యూ ఇయర్ వేడుకల సందర్భంలో హైదరాబాద్ పోలీసులు కేవలం రోడ్డెక్కిన మందుబాబులను మాత్రమే కాదు.. డ్రగ్స్ బానిసలనూ పట్టుకోనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రగ్ టెస్టు కిట్‌లనూ కొనుగోలు చేశారు.
 


Drug Test Kits: సాయంత్రం 8 దాటితే పోలీసులు బ్రీత్ అనలైజర్లతో మందుబాబుల పని పట్టడానికి సిద్ధమైపోతారు. రోడ్డు పక్కన నిలబడి డ్రింక్ అండ్ డ్రైవర్లను పట్టుకుంటారు. భారీ జరిమానాలు, కౌన్సిలింగ్‌లు తప్పవు. పండుగల పూట ఈ చెకింగ్‌ల తీవ్రత పెరుగుతుంది. న్యూ ఇయర్ సందర్భంగానూ పోలీసులు ఇందుకు రెండింతలు గట్టిగానే సిద్ధం అవుతున్నారు. ఇక్కడ కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే.. ఈ సారి ట్రాఫిక్ పోలీసులు కేవలం ఆల్కహాల్ తాగారా? లేదా? అనే టెస్టు మాత్రమే కాదు, డ్రగ్స్ టెస్టు కూడా చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొనుగోలు చేసిన డ్రగ్ టెస్టు కిట్‌లను ఉపయోగించనున్నారు.

తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) పోలీసులు పలు రకాల డ్రగ్ టెస్టింగ్ పరికరాలను కొనుగోలు చేశారు. నూతన సంవత్సర వేడుకలకు ముందు భిన్న రకాల 50 డ్రగ్ టెస్టు కిట్‌లను కొన్నారు. వీటి ఆధారంగా ఫామ్ హౌజ్‌లు, పబ్‌లు, రిసార్ట్‌లు, పార్టీలు చేసుకునే ఇతర ప్రాంతాల్లోనూ టెస్టులు చేయనున్నారు.

Latest Videos

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు ఈ డ్రగ్ టెస్టు కిట్‌లు అందాయి. ఈ డ్రగ్ టెస్టు కిట్‌ల ద్వారా పట్టుబడిన వారిని అదుపులోకి తీసుకుని డీ అడిక్షన్ ప్రోగ్రామ్స్‌కు పంపిస్తారు. ఈ డ్రగ్ టెస్టు కిట్‌ల గురించి టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ.. డ్రేగర్ డ్రగ్‌చెక్ 3000 అనే డివైజ్ ఈ టెస్టు చేస్తుందని, లాలాజలం శాంపిల్ తీసుకుని వారు డ్రగ్ తీసుకున్నారా? లేదా? అనేది నిమిషాల వ్యవధిలోనే తేల్చి చెప్పుతుందని తెలిపారు.

Also Read: BRS: 22 ల్యాండ్ క్రూయిజర్లపై బీఆర్ఎస్ రియాక్షన్.. అందుకే కొన్నామని కడియం వివరణ

ఎలా పని చేస్తుంది?

కొకైన్, గంజాయి, ఓపియేట్స్, ఆంఫెటమైన్స్, మెథాంఫెటమైన్స్, కెటమైన్స్ వంటి డ్రగ్స్ రకాలను ఈ డ్రేగర్ పరికరం కనిపెట్టగలదు. ఓ టెస్టు క్యాసెట్‌ను అనాలసిస్ కోసం ఉపయోగిస్తారు. శానిటరీ శాంపిల్ కలెక్షన్ ద్వారా లాలాజల శాంపిల్ తీసుకుంటారు. దీనికి ఓ బఫర్ లిక్విడ్ కలుపుతారు. టెస్టు క్యాసెట్‌కే ఓ విండో ఉంటుంది. అందులో రెండు టెస్టు స్ట్రిప్స్ ఆ శాంపిల్ కంట్రోల్స్‌ను వెల్లడిస్తుంది. ఈ డ్రగ్ టెస్టును మూడు రకాలుగా చేస్తారు.

థర్మోస్టాటిక్ హ్యాండ్‌హెల్డ్ నార్కోటిక్స్ అనలైజర్ దీనికి అదనంగా ఉండే పరికరం. ఇది సమీపంలోని వస్తువుల్లో డ్రగ్ అవశేషాలను పసిగడుతుంది.

click me!