బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. శాసనమండలిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, జీవన్ రెడ్డిల మధ్య వాగ్వాదం..

By Sumanth KanukulaFirst Published Feb 4, 2023, 12:20 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ  సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈరోజు శాసనమండలిలో 24 గంటల ఉచిత విద్యుత్ విషయంపై బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

తెలంగాణ అసెంబ్లీ  సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈరోజు శాసనమండలిలో 24 గంటల ఉచిత విద్యుత్ విషయంపై బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలో 24 గంటల సరఫరా జరుగుతుందని అన్నారు. కరెంట్ రావడం లేదని కొందరు సైకో ఫ్యాన్స్ తప్పుడు ప్రచారం  చేస్తున్నారని అన్నారు. అయితే ఈ కామెంట్స్‌పై స్పందించిన జీవన్ రెడ్డి.. క్షేత్రస్థాయిలో చూస్తే కరెంట్ ఎప్పుడూ వస్తుందో.. ఎప్పుడూ పోతుందో రైతులకు, విద్యుత్ శాఖ సిబ్బందికి కూడా తెలియడం లేదన్నారు. 

Also Read: అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ.. దేశానికే తెలంగాణ రోల్‌మోడ‌ల్‌గా మారిందన్న సండ్ర

రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ రావడం లేదని జీవన్ రెడ్డి అన్నారు. తాను స్వయండా సీఎండీ ప్రభాకర్‌రావుతో మాట్లాడినట్టుగా  చెప్పారు. పూర్థిస్థాయిలో విద్యుత్ సరఫరా చేయట్లేదని సీఎండీ చెప్పారని అన్నారు. 24 గంటలు త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా అయినట్టుగా తెలిస్తే క్షమాపణలు చెబుతానని అన్నారు. 
 

click me!