మోడీని ప్రశ్నిస్తే ఎవరికైనా ఇంతే .. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వెళ్తా : కల్వకుంట్ల కవిత

Siva Kodati |  
Published : Mar 15, 2023, 07:59 PM IST
మోడీని ప్రశ్నిస్తే ఎవరికైనా ఇంతే .. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వెళ్తా : కల్వకుంట్ల కవిత

సారాంశం

ప్రధాని మోదీని ఎవరు ప్రశ్నించినా ఇదే తరహా దాడులు జరుగుతాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి గురువారం మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్నారు కవిత. 

మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం తమ పోరాటం ఆగదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు తమ పార్టీతో సహా ఎవ్వరూ ఎక్కువ అవకాశాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని.. అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లుకు డిమాండ్ చేస్తున్నామని కవిత స్పష్టం చేశారు. ఈడీ ఎదుట హాజరవ్వడానికి ముందే మీడియాతో మాట్లాడతానని ఆమె పేర్కొన్నారు. 

సీఆర్‌పీసీ సెక్షన్ 160 ప్రకారం ఓ మహిళను ఇంటికి వెళ్లి మాత్రమే విచారించాలని .. కానీ ఈడీ మాత్రం కార్యాలయానికి పిలుస్తోందని కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళా బిల్లుపై పార్లమెంట్‌లో ఒత్తిడి తెస్తామని.. బిల్లు ఆమోదం పొందే వరకు పోరాటం చేస్తామని కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను ధర్నాకు ఆహ్వానించినా స్పందన లేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలను కూడా త్వరలోనే ఆహ్వానిస్తానని కవిత పేర్కొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని .. ఈడీ ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానని ఆమె స్పష్టం చేశారు. ప్రధాని మోదీని ఎవరు ప్రశ్నించినా ఇదే తరహా దాడులు జరుగుతాయని కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Also REad: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు సుప్రీంలో చుక్కెదురు: స్టేకి నిరాకరణ

కాగా.. ఈడీ విచారణపై  మధ్యంతర  ఉత్తర్వులు జారీ చేయాలని  కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు  చేసిన సంగతి తెలిసిందే.  అయితే ఈ పిటిషన్ పై  ఈ నెల 24న విచారణ  చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో  గురువారం ఈడీ విచారణకు  కవిత హాజరు కావాల్సిన పరిస్థితుులు నెలకున్నాయి. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని  కవిత తరపు న్యాయవాదులు  సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని  కోరారు. కానీ ఈ పిటిషన్ ను అడ్మిట్  చేసుకుంటామని .. అత్యవసరంగా విచారించలేమని  ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఈ నెల  24న ఈ పిటిషన్ పై విచారణ  చేస్తామని  సుప్రీంకోర్టు  ప్రకటించింది.  

ఇకపోతే.. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈ నెల  11న  కల్వకుంట్ల కవిత  ఈడీ విచారణకు  హాజరైన సంగతి తెలిసిందే. దాదాపు తొమ్మిది గంటల పాటు  కవితను  ఈడీ అధికారులు విచారించారు. ఈ నెల 16న మరోసారి  విచారణకు  రావాలని ఈడీ అధికారులు  ఆమెకు నోటీసులు ఇచ్చారు. దీంతో  సుప్రీంకోర్టులో  కవిత న్యాయ  పోరాటానికి దిగారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ
Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ