
ఎవరి భాష వాళ్లకు ఉంటుంది కానీ ఒకరిపై ఒకరు పెత్తనం చేసుకునే అవసరం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. భారత జాగృతి సాహిత్య సభల్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. సాహితీ ప్రేమికులుగా హిందీ భాషలో ఉన్న సాహిత్యాన్ని ఆరాదిస్తామని, కానీ ఇదే మాట్లాడాలని రూల్స్ పెడితే మాత్రం తప్పకుండా రూల్స్ బ్రేక్ చేస్తామన్నారు. తెలంగాణ అనే పరిమిత దృక్పథం నుంచి భారతీయత అనే విశాల దృక్పథం వైపు మనం ప్రయాణించాల్సిన అవసరం ఉందని కవిత పేర్కొన్నారు.
ఇంకా కవిత ఏమన్నారంటే.. తెలంగాణ రాష్ట్రం సాదించుకోవడం ఎంత ముఖ్యమో మన సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలని జాగృతి ఉద్యమం చేసింది.ప్రతి సంవత్సరం సాహిత్య సభలు జరపాలని ఈ కార్యక్రమం రూపొందించాం. రెండు రోజుల పాటు ఈ సాహిత్య సభలు జరుగుతాయి అన్ని అంశాల మీద కూలంకషంగా చర్చలు జరుగుతాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించుకున్నాం. అందరిని భాగస్వామ్యం చేస్తూ ఈ సాహిత్య సభలు విజయవంతం చేసుకుందాం’ అన్నారు. తెలంగాణ జాగృతి దేశంలో ఉన్న ప్రజలను జాగృతం చేసేందుకు భారత జాగృతిగా రూపుదిద్దుకుంది.. 530 కు పైగా కళాకారులకు జీతం ఇస్తూ వారిని గౌరవిస్తూన్నాం. కళాకారులను గుర్తించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
డా.నందిని సిదారెడ్డి
‘‘ భారత జాగృతి ఈ సాహిత్య సభలు నిర్వహించడం చాలా సంతోషం ఉద్వేగంగా ఉంది. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడంలో భారత జాగృతి, ఏమ్మెల్సీ కవిత కృషి చేస్తున్నారు. ఇధి ఎంతో అభినందనీయం. ఉమ్మడి రాష్ట్రంలో బతుకమ్మ పండుగ జరపాలని అప్పటి సీఎం దగ్గరికి వెళితే బతుకమ్మ కూడా పండుగేనా అని అన్నారు. బతుకమ్మ కూడా పండుగేనా అని ఆనాటి ఆంధ్రపాలకులు హేళన చేశారు. అలాంటి దశలో ఎమ్మెల్సీ కవిత బతుకమ్మను ఎత్తుకొని బతుకమ్మ పండుగ గుర్తింపుకు విశేష కృషి చేసారు ’’.
‘‘ బతుకమ్మకు భారతదేశ వ్యాప్తంగా ఖ్యాతి రావాలని ఎమ్మెల్సీ కవిత కృషి చేసారు. మన దేశంతో పాటు ప్రపంచ దేశాల్లో బతుకమ్మ పండుగలు నిర్వహించారు. ఈ రోజు బతుకమ్మ కు ఎంతో ఖ్యాతి రావడం ఎమ్మెల్సీ కవిత కృషి వల్లనే. ఈ తొమ్మిదేళ్లలో ఉద్యమ ఫలితాలు మనం అనుభవిస్తున్నాం. నేడు తెలంగాణ భాష లేకపోతే సినిమాలు ఆడే పరిస్థితి లేదన్నారు. ’’.