ఢిల్లీలో లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా దత్తాత్రేయ హాజరు

By Mahesh KFirst Published Jun 21, 2023, 6:00 PM IST
Highlights

ఢిల్లీలో లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి దేవాలయం నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ వద్ద ఆయన ఈ బోనాల పండుగలో పాల్గొన్నారు.
 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో పాతబస్తీలోని లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి బోనాలను అక్కడ దేవాలయం కమిటీ నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, నృత్యాలతో జోరుగా ఊరేగింపు సాగింది. 

ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ వద్దకు వెళ్లి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆయన వెంటే హర్యానా గవర్నర్‌కు ప్రైవేట్ సెక్రెటరీ కైలాస్ నగేశ్ కూడా ఉన్నారు. ఈ ఉత్సవాల్లో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం, బీఆర్ఎస్ ఎంపీలు కే ఆర్ సురేష్ రెడ్డి, వెంకటేష్ నేత, మన్నే శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లాల్ దర్వాజ బోనాలు ఘనంగా జరుగుతాయి. నగర ప్రజలంతా ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ సారి జులై 7 నుంచి లాల్ దర్వాజ మహంకాళి బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.

Also Read: రేపటినుంచి తెలంగాణలో బోనాల పండుగ షురూ....

తెలంగాణలో యేటా అంగరంగవైభవంగా జరిగే ఆషాడ బోనాలు ఈనెల 22 వ తేదీ నుండి అంటే రేపటినుంచి ప్రారంభం కాబోతున్నాయి. నెలరోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు మొట్టమొదటగా గోల్కొండ బోనాలతో ప్రారంభం అవుతాయి. లంగర్ హౌస్ లో నిర్వహించే  గోల్కొండ బోనాల తొట్టెల ఊరేగింపులో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ పాల్గొననున్నారు.

click me!