మోడీ నోటీసు వచ్చింది.. సీరియస్‌‌గా తీసుకోనక్కర్లేదు, లీగల్ టీమ్ పరిశీలిస్తోంది : కల్వకుంట్ల కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పంపిన నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు.  దానిని పెద్ద సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని కవిత కొట్టిపారేశారు. 

BRS mlc kalvakuntla kavitha reacts on ed notice on delhi liquor case ksp

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పంపిన నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. నిజామాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మోడీ నోటీసు వచ్చిందన్నారు. దానిని పెద్ద సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని కవిత కొట్టిపారేశారు. ఇది రాజకీయకక్షతో వచ్చిందేనని.. ఏడాది నుంచి టీవీ సీరియల్ మాదిరిగా నడిపిస్తున్నారని కవిత వ్యాఖ్యానించారు. ఈడీ నోటీసులపై తమ పార్టీ లీగల్ సెల్‌ వాటిని పరిశీలిస్తోందని.. న్యాయ నిపుణుల సలహాను అనుసరించి నిర్ణయం తీసుకుంటానని కవిత స్పష్టం చేశారు. ఎన్నికల సమయం కావడంతో కొత్త ఎపిసోడ్ రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసని మొదటి నుంచి చెబుతూనే వున్నామని కవిత వ్యాఖ్యానించారు. 

vuukle one pixel image
click me!