చంద్రబాబు అరెస్టుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కామెంట్.. ఏమన్నారంటే?

By Mahesh KFirst Published Sep 14, 2023, 4:42 PM IST
Highlights

చంద్రబాబు అరెస్టుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. ఆయన అరెస్టును ఖండించారు. గవర్నర్‌ను అనుమతి లేకుండా అరెస్టు చేయడం సరికాదని పేర్కొన్నారు.
 

హైదరాబాద్: ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అరెస్టుపై తెలంగాణలోనూ అక్కడక్కడ పలు విధానాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది వరకే పలువురు మంత్రులు కూడా ఈ విషయమై స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఖమ్మం నుంచి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పువ్వాడ అజయ్ కుమార్ చంద్రబాబు అరెస్టుపై స్పందించారు.

మంత్రి పువ్వాడ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును అరెస్టును ఖండిస్తున్నట్టు చెప్పారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం సరికాదని తెలిపారు.

సీఎంగా ఉన్నప్పుడు ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి పువ్వాడ అన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని వివరించారు. అది గుర్తించాలని తెలిపారు. అంతేకానీ, రాజకీయాల్లో కక్ష సాధింపు పనులు ఎంతమాత్రం మంచివి కావని చెప్పారు.

Also Read : లాఠీ డెడ్లీ వెపన్ కాదు, చంపాలనే ఉద్దేశ్యం లేకుంటే కర్రల దాడిలో మరణిస్తే అది హత్యానేరం కాదు: తెలంగాణ హైకోర్టు

కరీంనగర్‌లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును ఈ విధంగా అరెస్ట్ చేయడాన్ని ప్రతి ఒక్కరు తప్పని అంటున్నారని తెలిపారు. చంద్రబాబును కక్షపూరితంగా అరెస్ట్ చేశారనేది స్పష్టంగా కనబడుతుందని చెప్పారు. తప్పు చేస్తే అరెస్ట్ చేయడాన్ని ఎవరూ కాదనరని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేని వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారనేది అర్థం కావడం లేదని చెప్పారు. రాజకీయంగా కక్షలు ఉంటే రాజకీయంగా కొట్లాడాలని అన్నారు. 

click me!