బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఈడీ విచారణకు సంబంధించి కేసీఆర్ కు కవిత వివరించే అవకాశం ఉంది.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారంనాడు న్యూఢిల్లీ నుండి వచ్చి నేరుగా ప్రగతి భవన్ కు చేరుకున్నారు. తెలంగాణ కేసీఆర్ తో కవిత భేటీ అయ్యినట్టుగా సమాచారం. రెండు రోజుల పాటు ఈడీ విచారణకు సంబంధించి కేసీఆర్ కు కవిత వివరించే అవకాశం ఉంది.
ఈ నెల 11వ తేదీన ఈడీ విచారణ ముగిసిన తర్వాత కవిత నేరుగా ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఈడీ విచారణ తీరుపై కేసీఆర్ కు వివరించారు. రెండు రోజులుగా ఈడీ విచారణ తీరు తెన్నులను కవిత కేసీఆర్ కు వివరించారు.ఈడీ అధికారుల వ్యవహరించిన తీరును కవిత కేసీఆర్ దృష్టికి తీసుకు వచ్చారు.ఈడీ అధికారులకు కవిత తన మొబైల్ ఫోన్లను నిన్న అందించారు.
ఈ నెల 6వ తేదీన అరుణ్ రామచంద్రపిళ్లైని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అరుణ్ రామచంద్ర పిళ్లై ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఈడీ అధికారులు కవితకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 8వ తేదీన కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.ఈ నెల 9వ తేదీన విచారణకు రావాలని కోరారు. అయితే ముందుగా ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలు ఉన్నందున విచారణకు రాలేనని కవిత ఈడీకి లేఖ రాశారు. ఈ నెల 11న ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు. ఈ నెల 16న విచారణకు రావాలని కవితకు ఈడీ అధికారులు నోటీసులు పంపారు.
also read:న్యూఢిల్లీ నుండి హైద్రాబాద్ బయలుదేరిన కవిత
అయితే ఈ నెల 15న ఢిల్లీకి చేరుకున్నప్పటికీ ఈ నెల 16న ఈడీ విచారణకు కవిత హాజరు కాలేదు. ఈడీ అడిగిన సమాచారాన్ని కవిత బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ద్వారా పంపారు. ఈడీ విచారణపై తాను దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈనెల 24న విచారించనున్నందున అప్పటివరకు విచారణకు రాలేనని కవిత ఈడీకి భరత్ ద్వారా లేఖ పంపారు. కానీ ఈ నెల 20న విచారణకు రావాలని కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడంతో విచారణకు కవిత హాజరు కావాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.